టెలిగ్రామ్ యాప్ పై కేంద్రం తాత్కాలిక‌ నిషేధం

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ప్ర‌భుత్వం

hellotelugu-TelegramAPP

న్యూఢిల్లీ : కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. నీట్ యుజి 2026 రీ ఎగ్జామ్ ఈనెల 21వ తేదీన దేశ వ్యాప్తంగా నిర్దేశించిన కేంద్రాల‌లో నిర్వహించాల‌ని నిర్ణ‌యించింది నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఇప్ప‌టికే ఈ ఏడాది మే నెల‌లో నిర్వ‌హించింది ప‌రీక్ష‌ను. కానీ ఈ పేప‌ర్ పూర్తిగా లీక్ కావ‌డంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీని వెనుక భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన నేత‌ల‌తో పాటు ఓ ఫ్రొఫెస‌ర్, ఓ కోచింగ్ సెంట‌ర్ ముఖ్య పాత్ర ఉంద‌ని నిర్దారించారు. దీనిపై కేంద్రం ద‌ర్యాప్తు సంస్థ సీబీఐకి విచార‌ణ కోసం ఆదేశించింది. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై దేశ‌మంత‌టా ఆందోళ‌న కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆద్వ‌ర్యంలో భారీ ఎత్తున ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో తిరిగి ప‌రీక్ష‌ను నిర్వహించాల‌ని కేంద్రం నిర్ణ‌యించింది. ఈ సారి గ‌తంలో కంటే భిన్నంగా మ‌రో 15 నిమిషాలు పొడిగించిన‌ట్లు ప్ర‌క‌టించింది ఎన్టీఏ. లీకులు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను కేంద్రం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధానంగా టెలిగ్రామ్ యాప్ ను ఉప‌యోగిస్తున్న‌ట్లు విచార‌ణ‌లో తేలింది. దీంతో ప్ర‌భుత్వం ముందు జాగ్ర‌త్త‌గా టెలిగ్రామ్’ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. బుధ‌వారం ఇందుకు సంబంధించి అధికారికంగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇదిలా ఉండ‌గా ఈ టెలిగ్రామ్ యాప్ నిర్వ‌హ‌ణ‌ను జూన్ 22 వ‌ర‌కు ప‌ని చేయ‌ద‌ని తెలిపింది. నీట్ పరీక్ష సురక్షితంగా నిర్వహించేందుకు NTA సిఫార్సుతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్ల వెల్ల‌డించింది మోదీ స‌ర్కార్.

Exit mobile version