సీఈసీ జ్ఞానేష్ కుమార్ దిగి పోవాల్సిందే : రాహుల్ గాంధీ

ఇండియా బ్లాక్ నిర‌స‌న సంద‌ర్బంగా ప్రియాంక గాంధీ అరెస్ట్

hellotelugu-RahulGandhi

న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన అధికారి జ్ఞానేష్ కుమార్ పై నిప్పులు చెరిగారు అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ. త‌క్ష‌ణమే త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. డిల్లీ వేదిక‌గా ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సీనియ‌ర్ నేత‌ల‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా , ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి న్యూఢిల్లీలోని భారత ఎన్నికల సంఘం కార్యాలయం వైపు పాదయాత్ర చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ విషయంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. నీతి ఆయోగ్ కార్యాలయం సమీపంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకుని, వారు ముందుకు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

మార్చ్‌ను నిలిపివేసిన తర్వాత రాహుల్ గాంధీ పోలీసు బారికేడ్‌పైకి ఎక్కి త్రివర్ణ పతాకాన్ని ఊపారు. అనంతరం ఆయన ఇతర ప్రతిపక్ష నాయకులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఇతర ఇండియా బ్లాక్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స‌ర్) పై ఈ నిరసన కేంద్రీకృతమై ఉంది. ఇండియా బ్లాక్ నాయకులు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో పాటు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఇంతకు ముందు రాహుల్ గాంధీ, సీఈసీని లక్ష్యంగా చేసుకుని, “జ్ఞానేష్, అయిపోయింది బ్రో. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది” అని ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. ఓటర్ల జాబితా సవరణ, ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం నిర్వహించిన తీరుపై కొనసాగుతున్న రాజకీయ వివాదం మధ్య ఈ నిరసన చోటు చేసుకుంది.

Exit mobile version