బ్రహ్మంగారి మఠం పీఠాధిప‌తి కేసు వాయిదా

మూడు గంట‌ల పాటు సుదీర్ఘ వాద‌న‌లు

hellotelugu-BrahmamGariMaatam

నంద్యాల జిల్లా : శ్రీ పోతులూరి వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి పీఠాధిప‌తిపై దాఖ‌లైన కేసుకు సంబంధించి విచారించిన కోర్టు సోమ‌వారానికి వాయిదా వేసింది. మూడు గంటల సుదీర్ఘ వాదనలు వీరభద్ర స్వామి త‌ర‌పు లాయర్ వినిపించారు. పీఠాధిప‌తి వెంకటాద్రి స్వామి అశ్లీల వీడియోలు చూస్తారని, స్త్రీల లోదుస్తులు ప్రమోట్ చేసే ప్రాచ్య దేశాల పోర్న్ స్టార్ ల వీడియోలు తో పాటు డేటింగ్ సైట్ లు ఫాలో అవుతారని ఆరోపించారు. ఇలాంటి వారు పీఠాధిప‌తి స్థానానికి అర్హులు కార‌రంటూ పేర్కొన్నారు. క‌నీసం త‌ను దేనినీ ఫాలో కావ‌డం లేద‌ని, రోజూ వారీ ఆల‌య కార్య‌క‌లాపాల‌కు సంబంధించి ధార్మిక ప‌రిష‌త్ కు వివ‌రాలు వెల్ల‌డించక పోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంద‌న్నారు.

విచారణ చేయవలసిన ధార్మిక పరిషత్, దానిని పూర్తిగా ఇగ్నోర్ చేశారని, గురుపత్ని మాత్రమే కాకుండా ఇంకా భక్తులు శిష్యులు అనేక మంది వాటి గురించి పిర్యాదులు చేసినా కూడా ధార్మిక పరిషత విచారణ చేపించ లేదని ఆరోపించారు. వెంకటాద్రి స్వామి నియామకం కేవలం రాజకీయ ప్రేరేపిత నిర్ణయమని, అతనికి కనీస అర్ధత లేదని పేర్కొన్నారు. ధార్మిక పరిషత్ జారీ చేసిన ఆర్డర్ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుకు వ్యతిరేకమని, డివిజన్ గురించి క్లియర్ గా అర్హతల ప్రాతిపదికగా నియామకం చేయమని ఆదేశించింద‌ని గుర్తు చేశారు.

ధార్మిక పరిషత్ రిపోర్ట్ లో అతనికన్ని అర్హతలు ఉన్నాయని కూడా చెప్పలేదన్నారు. అశ్లీల వీడియోలు చూడడం మోరల్ క్యారెక్టర్ లేదని చెప్పడానికి ఆదారంగా చూడవచ్చునా అని జడ్జి ప్ర‌శ్నించారు. 400 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి భారతీయ సనాతన హైందవ ధర్మంలో విశిష్ట స్థానం కలిగిన జగద్గురు పీఠం బ్రహ్మం మఠం పీఠాధిపతులుగా కావాలనుకునే వారు, అలాంటి వీడియోలు అలాంటి ఫాలో అవ్వకూడదని చెప్తూ ఇదే చట్టం కు సుప్రీం కోర్టు చెప్పిన భాష్యం తీర్పును రిఫర్ చేశారు. దీంతో కేసును
సోమవారానికి తదుపరి విచారణ వాయిదా వేశారు .

 

Exit mobile version