Popular Actress Shilpa Shetty : రూ. 60 కోట్ల మోసం న‌టి శిల్పా, కుంద్రాపై కేసు

2015లో రుణంగా తీసుకుని ఇవ్వ‌డం లేద‌ని ఫైర్

Hello Telugu - Popular Actress Shilpa Shetty

Hello Telugu - Popular Actress Shilpa Shetty

Shilpa Shetty : ముంబై – ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేర మోసం చేసినట్లు ఆరోపణలు రావ‌డంతో న‌టి శిల్పా శెట్టితో పాటు త‌న భ‌ర్త‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. కేసుకు సంబంధించిన‌ దర్యాప్తును ఆర్థిక నేరాల విభాగం (EOW)కి అప్ప‌గిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా పోర్న్ వీడియోల నిర్మాణం చేప‌ట్టారంటూ ఇప్ప‌టికే శిల్పా (Shilpa Shetty) భ‌ర్త‌పై కేసు న‌మోదైంది. ఆయ‌న జైలుకు వెళ్లి ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ కేసుకు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. జుహూకు చెందిన వ్యాపార‌వేత్త శిల్పా శెట్టి కుంద్రా, భ‌ర్త రాజ్ కుంద్రా త‌మ‌కు రుణం కావాలంటూ 2015లో అడిగార‌ని తెలిపాడు. తాను వీరిని న‌మ్మి అప్పుగా ఇచ్చాన‌ని, ఆనాటి నుంచి నేటి వ‌ర‌కు ఒక్క పైసా కూడా త‌న‌కు ఇవ్వ‌లేద‌ని వాపోయాడు. అందుకే పోలీసుల‌ను ఆశ్ర‌యించాల్సి వ‌చ్చింద‌ని పేర్కొన్నాడు బాధితుడు.

Shilpa Shetty – Raj Kundra Shocking

దీంతో ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) జుహుకు చెందిన వ్యాపారవేత్త దీప‌క్ కొఠారిని రూ.60.48 కోట్లకు మోసం చేసినందుకు కేసు నమోదు చేసింది. రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి మధ్యవర్తి నుండి డబ్బును తిరిగి పొందడానికి తాను, తన కంపెనీ పదేపదే ప్రయత్నించామని కానీ ఇప్ప‌టి వ‌ర‌కు న‌టి, భ‌ర్త స్పందించ‌డం లేద‌ని ఆరోపించాడు వ్యాపార‌వేత్త‌. ఇదిలా ఉండ‌గా జుహులో నివసించే కొఠారి రుణాలు అందించే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అయిన లోటస్ క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. కొఠారి చివరికి శిల్పా కుంద్రా, రాజ్ కుంద్రాలు వ్యక్తిగత ప్రయోజనం కోసం నిధులను ఉపయోగించు కున్నారని, తనను మోసం చేశారని క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు.

Also Read : Telangana Govt Shocking : కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ సర్కార్ భారీ షాక్

Exit mobile version