‘ఓరి నాయనో’ చిత్రం ఘ‌నంగా ప్రారంభం

క్లాప్ కొట్టిన నిర్మాత వంశీ నందిపాటి

hellotelugu-OrNayanoo

హైద‌రాబాద్ : తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందించేందుకు ‘ఓరి నాయనో’ సిద్ధమవుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శుభ ముహూర్తంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ముహూర్తపు షాట్‌కు తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, ‘పొలిమేర’ ఫ్రాంచైజీ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ చిత్ర బృందానికి అభినందనలు తెలియ జేశారు. ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కథాంశాలతో తెరకెక్కే సినిమాలు మంచి విజయాలను సాధిస్తాయని అన్నారు. ‘ఓరి నాయనో’ కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. చిత్రానికి అవసరమైన సందర్భాల్లో తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ చిత్రం అనుకున్న స‌మ‌యానికి షూటింగ్ పూర్తి చేసుకుంటుంద‌ని, ప్రేక్ష‌కుల‌ను అల‌రించేలా ఉంటుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Exit mobile version