Sameer Modi : న్యూఢిల్లీ : అత్యాచారం ఆరోపణలపై ప్రముఖ వ్యాపారవేత్త సమీర్ మోడీని (Samir Modi) అదుపులోకి తీసుకున్నారు. న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ తర్వాత తనను ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం సాకేత్ కోర్టు ఢిల్లీ పోలీసులకు సమీర్ మోడీకి (Samir Modi) రెండు రోజుల రిమాండ్ మంజూరు చేసింది. నిందితుడు దాఖలు చేసిన ఫిర్యాదును పరిశీలించాలని కూడా కోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణను మూసివేసిన కోర్టు గదిలో నిర్వహించారు. ఇదిలా ఉండగా 2019 నుండి మోడీతో సంబంధం కలిగి ఉన్నానని ఆరోపించింది బాధితురాలు. తన ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 10వ తేదీన మొదటి సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ను నమోదు చేశారు.
Samir Modi Arrested
ఎవరీ సమీర్ మోడీ అనుకుంటున్నారా. తను మోడీకేర్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ కూడా. తను ప్రముఖ మోడీ వ్యాపార కుటుంబానికి చెందిన వాడు కావడం విశేషం. డిసెంబర్ 15, 1969న జన్మించాడు. దివంగత పారిశ్రామికవేత్త కె.కె. మోడీ చిన్న కుమారుడు. అంతే కాదు మాజీ ఐపిఎల్ చైర్మన్ లలిత్ మోడీకి స్వయాన సోదరుడు. సమీర్ కె. మోడీ డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసి, ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని హిందూ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాడు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుండి మేనేజ్‌మెంట్ డిగ్రీని పొందారు.
మోడీ 1992లో అమెరికాలో ఫిలిప్ మోరిస్‌తో మేనేజ్‌మెంట్ ట్రైనీగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు, మార్ల్‌బోరో సిగరెట్లను ప్రచారం చేయడంపై దృష్టి సారించాడు. 25 సంవత్సరాల వయస్సులో ఆయన మోడీకేర్‌ను స్థాపించారు. ఆయన గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా కూడా ప్రస్తుతం పని చేస్తున్నారు.
Also Read : AP Govt Huge Support : ఉల్లి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
