యూపీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంట‌రిగానే పోటీ

చేస్తామ‌ని ప్ర‌క‌టించిన పార్టీ చీఫ్ మాయావ‌తి

hellotelugu_mayawwati

ఉత్త‌ర ప్ర‌దేశ్ : బ‌హుజ‌న స‌మాజ్ పార్టీ (బీఎస్పీ) పార్టీ చీఫ్ , మాజీ సీఎం కుమారి మాయావ‌తి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2027 యూపీ ఎన్నికలతో సహా అన్ని ఎన్నికలలో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్ల‌డించింది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. లక్నోలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రధాన కార్యాలయంలో తన 70వ పుట్టినరోజు సందర్భంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో సహా దేశ వ్యాప్తంగా అన్ని ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపింది.

అన్ని చిన్న, పెద్ద ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేయడం త‌ప్ప మ‌రో మార్గం లేద‌న్నారు మాయావ‌తి.
ఈ సంద‌ర్బంగా రాబోయే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతోనూ ఎలాంటి పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. ఈ విషయంలో ఎలాంటి గందరగోళం ఉండద‌ని స్పష్టం చేశారు బీఎస్పీ చీఫ్‌. భవిష్యత్తులో, ఒక పొత్తు భాగస్వామి తమ ఓట్లను ముఖ్యంగా అగ్రవర్ణాల ఓట్లను బీఎస్పీకి సమర్థవంతంగా బదిలీ చేయగలదని పార్టీకి పూర్తి నమ్మకం కలిగితే, పొత్తుతో ఎన్నికలలో పోటీ చేయడంపై సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని ఆమె అన్నారు. అయితే అలాంటి పరిస్థితి ఏర్పడటానికి సంవత్సరాలు పడుతుందని కూడా ఆమె చెప్పారు.

Exit mobile version