హైద‌రాబాద్ లో పెరుగుతున్న‌ వాట‌ర్ ట్యాంక‌ర్ బుకింగ్ లు

ఎల్ నినో ప్ర‌భావంతో న‌గరంలో మొద‌లైన నీటి ఎద్ద‌డి

hellotelugu-HyderabadWater

హైద‌రాబాద్ : ఎల్ నినో ప్ర‌భావం దెబ్బ‌కు రాను రాను ప్ర‌జ‌ల‌కు నీళ్లందని ప‌రిస్థితి నెల‌కొంది. ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేప‌ట్టాల్సిన కాంగ్రెస్ స‌ర్కార్ చేతులెత్తేసింది. స్వ‌యంగా సీఎం రేవంత్ రెడ్డి విద్యుత్ ను పొదుపుగా వాడాల‌ని, వ్య‌వ‌సాయానికి నీళ్లు ఇవ్వ‌లేమ‌ని , ఇక తాగు నీటికి ఇబ్బందిగా మారే ప్ర‌మాదం ఉందంటూ ఇప్ప‌టికే చావు క‌బురు చల్ల‌గా చెప్పారు. మ‌రో వైపు రియ‌ల్ ఎస్టేట్ దందా జీరోకు ప‌డి పోయింది. రోజు రోజుకు ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిగా మార‌డంతో హైద‌రాబాద్ న‌గ‌రంలో నీటి ఎద్ద‌డి మ‌రింత తీవ్ర రూపం దాల్చే ప్ర‌మాదం నెల‌కొంది. ఈ త‌రుణంలో నీళ్ల కోసం వాట‌ర్ ట్యాంక‌ర్ ల బుకింగ్ లు పెరుగుతున్నాయి. రోజుకు క‌నీసం 8 వేల‌కు పైగా బుకింగ్ లు అవుతున్న‌ట్లు స‌మాచారం. దీంతో హైదరాబాద్ నీటి సరఫరాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ప్రతిరోజూ సుమారు 5,000 నుండి 8,000 ట్యాంకర్ బుకింగ్‌లను స్వీకరిస్తోంది.

సాధారణంగా ఆఫ్-సీజన్‌లో రోజువారీ బుకింగ్‌లు 800 నుండి 1,500 మధ్య ఉంటాయి. ఈ ఆకస్మిక పెరుగుదల రాబోయే నెలల్లో భూగర్భ జల మట్టాలు , తాగునీటి లభ్యతపై ఆందోళనలను మ‌రింత పంచేలా చేసింది. న‌గ‌రంలోని బోడుప్పల్, ఎల్.బి. నగర్ , మణికొండలలో నీటి ట్యాంకర్ బుకింగ్‌లు గణనీయంగా పెరిగాయి. బోర్‌వెల్‌లు , సాధారణ నీటి సరఫరాలు వారి అవసరాలను తీర్చలేక పోవడంతో అనేక నివాస ప్రాంతాల్లోని నివాసితులు ట్యాంకర్లపై ఆధార పడుతున్నారు. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన 18,806 బుకింగ్‌లతో పోలిస్తే, అక్టోబర్‌లో 62,565 ట్యాంకర్ బుకింగ్‌లు నమోదయ్యాయి, ఇది 233% పెరుగుదల. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి రుతుపవనాల సమయంలో వర్షపాతం లోటు. హైదరాబాద్ భూగర్భ జల శాఖ ప్రకారం, సెప్టెంబర్ వరకు సాధారణంగా కురవాల్సిన 627.2 మి.మీ వర్షపాతానికి బదులుగా కేవ‌లం 458.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.

Exit mobile version