గాడి త‌ప్పిన డొనాల్డ్ ట్రంప్ పాల‌న : బ‌రాక్ ఒబామా

నిప్పులు చెరిగిన అమెరికా మాజీ దేశాధ్య‌క్షుడు

hellotelugu-Obama

వాషింగ్ట‌న్ : యుఎస్ దేశ మాజీ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా నిప్పులు చెరిగారు ప్ర‌స్తుత దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ పై. ఆయ‌న ఎప్పుడైతే కొలువు తీరాడో ఆనాటి నుంచి అమెరికా ప్ర‌జ‌ల‌కు నిద్ర లేకుండా పోయింద‌న్నారు. రోజు రోజుకు ఏం మాట్లాడుతున్నాడో, ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడో ఎవ‌రికీ అర్థం కాకుండా పోయింద‌న్నారు. చిల్ల‌ర నిర్ణ‌యాలు తీసుకుంటూ జ‌నాన్ని ఇబ్బందులకు గురి చేయ‌డం ప‌నిగా పెట్టుకున్నాడ‌ని ఆరోపించారు ఒబామా. ఎప్పుడూ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌ని మాజీ చీఫ్ ఉన్న‌ట్టుండి ట్రంప్ పై ప్ర‌త్య‌క్షంగా విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. తాజాగా ఒబామా ట్రంప్ గురించి చేసిన కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. తాము యుద్దాన్ని కోరుకోవ‌డం లేద‌న్నారు. కానీ ట్రంప్ వ‌చ్చాక ఇరాన్ పై ఏక‌ప‌క్ష దాడుల‌కు పురిగొల్ప‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. మొత్తంగా అమెరికాలో ట్రంప్ పాల‌న పూర్తిగా గాడి త‌ప్పింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు ఒబామా.

ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఒబామా ట్రంప్ పరిపాలనను ఎగతాళి చేశారు. 2026 మధ్యంతర ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ అధ్యక్షుడు పాల్గొన్న మొదటి ర్యాలీ ఇదే కావ‌డం విశేషం. ఆధునిక కాలంలో మనం చూడని అసమర్థత అని ఆయన ట్రంప్ పరిపాలనను అభివర్ణించారు. ట్రంప్ రెండవ పదవీకాలం ఇప్పటి వరకు గందరగోళం, క్రూరత్వం , అవినీతితో నిండిన రెండేళ్లు గ‌డిచి పోయింద‌న్నారు. ఇక ఉన్నతాధికారులు గౌరవనీయమైన వ్యక్తులు కారని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఒబామా. ఎవరూ కోరని ఇరాన్‌తో యుద్ధంలోకి అమెరికాను నడిపిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

Exit mobile version