న్యూఢిల్లీ : దేశ రాజధాని వేదికగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆతిథ్య జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ప్లే ఆఫ్స్ రేసును మరింత క్లిష్టతరంగా మార్చేసింది ఢిల్లీ. దీంతో చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది రాజస్థాన్ రాయల్స్ కు. ఆ జట్టు ఆరంభంలో అదుర్స్ అనిపించినా ఆ తర్వాత పడుతూ లేస్తూ వస్తోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్స్ లో భారీ పరుగులు సాధించినా సూర్య వంశీ, రియాన్ పరాగ్ లు రెచ్చి పోయాన ఆ తర్వాత ఆ జట్టు ను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టాడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు చెందిన స్టార్ బౌలర్ స్టార్క్ . తను 4 ఓవర్లు వేసి 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు.
ఒకానొక దశలో 160 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ ఆఖరు ఆరు ఓవర్లలో కేవలం 30 పరుగులకే పరిమితమైంది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 193 రన్స్ మాత్రమే చేసింది. అనంతరం 194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. ఫుల్ ఫామ్ లో ఉన్న మాజీ కెప్టెన్ కేఎల్ రాహుల్ 42 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 56 రన్స్ చేస్తే , అభిషేక్ పోరెల్ 31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 సత్తా చాటాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ పని పూర్తి చేశాడు. సొంతగడ్డపై 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌పై విజయం సాధించింది ఢిల్లీ క్యాపిటల్స్.
