Brain Eating Amoeba : కేరళలో ప్రమాదకరమైన నేగ్లేరియా ఫౌలేరి అమీబా విజృంభిస్తోంది. ఇప్పటివరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా, 67 మందికి ఇన్ఫెక్షన్ సోకింది. ఈ పరిస్థితితో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది. పొరుగు రాష్ట్రాలు కూడా అప్రమత్తమై హై అలర్ట్ జారీ చేశాయి.
Brain Eating Amoeba – వ్యాధి ఎలా వ్యాపిస్తుంది?
ఈ అమీబా సాధారణంగా నిల్వ నీరు, చెరువులు, సరస్సులలో పెరుగుతుంది. ఆ నీటిలో ఈత కొడితే, అమీబా ముక్కు ద్వారా మెదడులోకి ప్రవేశించి కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాంతకమయ్యే అవకాశం ఉంది.
లక్షణాలు
- తీవ్రమైన తలనొప్పి
- జ్వరం
- వికారం, వాంతులు
ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత 1–9 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
జాగ్రత్తలు, చికిత్స
- చెరువులు, సరస్సులు, నిల్వ నీటిలో స్నానం/ఈతకు దూరంగా ఉండాలి.
- ఈత సమయంలో ముక్కు క్లిప్‌లు వాడాలి.
- బావులు, నీటి ట్యాంకులను క్లోరిన్‌తో శుభ్రపరచాలి.
- నిల్వ నీటిని తాకిన తర్వాత జ్వరం లేదా తలనొప్పి వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Also Read : PM Modi Important Update on GST : జీఎస్టీ రాయితీలతో దేశానికి నూతన ఆరంభం: ప్రధాని మోదీ



















