అమరావతి : ఫార్చ్యూన్ ఇండియా యొక్క 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో హెరిటేజ్ సంస్థ సీఈవో, మంత్రి నారా లోకేష్ , సీఎం చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. ఈ సందర్బంగా తను అవార్డును అందుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు సీఎం. తెలుగు వారి కుటుంబాలకు తను స్పూర్తి దాయకంగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఘనత సాధించినందుకు బ్రాహ్మణిని అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక గుర్తింపు ఆమె నాయకత్వం, అంకితభావం , శ్రేష్ఠత పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తుందని నాయుడు అన్నారు. అవార్డును అందుకున్న సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ ఫార్చ్యూన్ ఇండియా లోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో గుర్తింపు పొందడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఇదే క్రమంలో బ్రాహ్మణి తమ కుటుంబానికి గర్వకారణంగా నిలుస్తూ, లెక్కలేనంత మంది యువతులకు, ముఖ్యంగా తెలుగు కుమార్తెలకు ఆత్మవిశ్వాసంతో నాయకత్వం వహించడానికి స్ఫూర్తినిస్తున్నారని నాయుడు అన్నారు. ఆమె భవిష్యత్తులో చేపట్టే అన్ని ప్రయత్నాలలో మరిన్ని మైలురాళ్లను , నిరంతర విజయాన్ని సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్బంగా నారా బ్రాహ్మణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మైలురాయి నాతో ఈ ప్రయాణంలో నడిచిన అద్భుతమైన బృందం, మార్గదర్శకులు , భాగస్వాముల ప్రతిబింబం. ఈ గుర్తింపునకు కృతజ్ఞతలు, సరిహద్దులను అధిగమించడానికి స్ఫూర్తిని పొందుతున్నానని అన్నారు. ఇదే క్రమంలో తన అత్త నారా భువనేశ్వరి గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు.

















