TTD EO Shocking Inspection : తిరుమ‌ల‌లో ఈవో ఆకస్మిక తనిఖీలు

హ‌డ‌లెత్తించిన అనిల్ కుమార్ సింఘాల్

Hello Telugu - TTD EO Shocking Inspection

Hello Telugu - TTD EO Shocking Inspection

TTD EO : తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ఈవోగా నూత‌నంగా కొలువు తీరిన అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి రావ‌డం, వారికి అందుతున్న క‌నీస సౌక‌ర్యాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌నే దానిపై ప‌రిశీలించారు. కొన్ని చోట్ల ఆక‌స్మిక త‌నిఖీలు చేశారు ఈవో (TTD EO). తిరుమలలోని పలు ప్రాంతాలను క‌లియ తిరిగారు. భ‌క్తుల‌తో సంభాషించారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అన్న‌దానం జ‌రుగుతుందా అని ప్ర‌శ్నించారు. ప్ర‌తి ఒక్క‌రినీ ఆరా తీశారు అనిల్ కుమార్ సింఘాల్.

TTD EO Sudden Inspection

ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజు రోజుకూ మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్‌వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని సూచించారు అనిల్ కుమార్ సింఘాల్. తిరుమలలో మిస్సింగ్ పర్సన్స్ గుర్తించే ప్రక్రియ మరింత వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్ప‌ష్టం చేశారు.తిరుమలలోని ప్రతి అంగుళాన్ని మానిటర్ చేయగల విధంగా సిబ్బందిని నియమించి కమాండ్ కంట్రోల్ సెంటర్ సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు.

ఆ తర్వాత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ల‌గేజీ కౌంట‌ర్ల‌ను కూడా ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఈవో మాట్లాడారు. ఏ ఒక్క భ‌క్తుడికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు. ఎవ‌రైనా నిర్ల‌క్ష్యం వ‌హించినా స‌హించే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. బ్ర‌హ్మోత్స‌వాల‌కు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు తెలిపారు ఈవో.

Also Read : CM Chandrababu Important Updates : అమరావ‌తిలో ఎన్టీఆర్ స్మృతివ‌నం : సీఎం

Exit mobile version