Botsa Satyanarayana Shocking Comments : రిగ్గింగ్ చేయ‌డం వ‌ల్లే గెలిచారు : బొత్స

చంద్ర‌బాబు చ‌రిత్ర‌లో దోషిగా నిలిచి పోతాడు

Hello Telugu - Botsa Satyanarayana Shocking Comments

Hello Telugu - Botsa Satyanarayana Shocking Comments

Botsa Satyanarayana : విశాఖ‌పట్నం – ఏపీ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ (Botsa Satyanarayana). ఆగ‌స్టు 12న జ‌రిగిన పోలింగ్ పూర్తిగా బ్లాక్ డేగా నిలిచి పోతుంద‌న్నారు. అక్క‌డ జ‌రిగింది పోలింగ్ కాద‌ని రిగ్గింగ్ అని పేర్కొన్నారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ప్ర‌జాస్వామ్యం అపహాస్యం పాలైందన్నారు. ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచి పోతాడని స్ప‌ష్టం చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతాభావంతో ఉన్నాడని, అందుకే ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టుపట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు.

Botsa Satyanarayana Slams NDA Govt

ప్రజాస్వామ్యబద్దంగా జరగాల్సిన ఎన్నికలకు అర్థాన్నే చంద్రబాబు మార్చేశారని ఆవేద‌న చెందారు. ఎన్నికల అధికారులు, పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచిందన్నారు. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది.? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజాతీర్పును కోరకుండా, వ్యవస్థలను భ్రష్టు పట్టించి, అడ్డదోవలో గెలుపొందేందుకు తెగించిందంటూ నిల‌దీశారు. ఎన్నికలు అంటేనే నిస్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు. కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి, ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యక్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్‌లో తిరుగుతుంటే, వారికి పోలీసులు భద్రత కల్పించారని ఆరోపించారు.

ఈ పరిణామాలనే మాజీ సీఎం వైయస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారని , ఇంత వయస్సు వచ్చిన సీఎం చంద్రబాబుకు బహుశా ఇవే చివరి ఎన్నికలు కూడా కావచ్చ‌ని జోష్యం చెప్పారు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌. జనం మంచిగా చెప్పుకునేలా పనులు చేయాలే కానీ ఇలాంటి మచ్చ తెచ్చుకునేలా చేస్తారా అని ప్రశ్నిస్తే తెలుగుదేశం వారు జీర్ణించు కోలేక పోతున్నారని మండిప‌డ్డారు.

Also Read : Minister Kandula Durgesh Alarming : ఉప ఎన్నిక‌ల్లో ప్రజాస్వామ్యం గెలిచింది

Exit mobile version