Bomb Blast – Red Fort : ఎర్ర‌కోట స‌మీపంలో బాంబు పేలుడు

13 మంది దుర్మ‌ర‌ణం, ప్ర‌ధాని సంతాపం

Hello Telugu - Bomb Blast - Red Fort

Hello Telugu - Bomb Blast - Red Fort

Red Fort  : ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ఎర్ర‌కోట (Red Fort) స‌మీపంలో బాంబు పేలుడు ఘ‌ట‌న సంభవించింది. ఈ ఘ‌ట‌న‌లో 13 మంది మృతి చెందారు. ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద ప్ర‌జ‌ల‌తో ఉన్న కారు పేలి పోయింది. ఎర్ర‌కోట మెట్రో స్టేష‌న్ స‌మీపంలో 6.52 గంట‌ల‌కు హ్యుందాయ్ టి20 కారులో పేలుడు సంభ‌వించింది. దీంతో ర‌ద్దీగా ఉండే ప్రాంతంలో మృతేద‌హాలు, శిథిల‌మైన కార్లు చెల్లా చెదురుగా ప‌డి పోయాయి. ఇదిలా దేశంలోనే అత్యంత హై ప్రొఫైల్ ప్ర‌దేశాల‌లో ఒక‌టిగా గుర్తింపు పొందింది ఎర్ర‌కోట‌. దాని స‌మీపంలోనే ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో 24 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఇది అత్యంత శ‌క్తివంత‌మైన పేలుడు అని పోలీసు వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

Bomb Blast in Red Fort

ఎర్ర‌కోట ట్రాఫిక్ సిగ్న‌ల్ వ‌ద్ద నెమ్మ‌దిగా క‌దులుతున్న వాహ‌నంలో పేలుడు సంభ‌వించింది. కారులో ప్ర‌యాణికులు ఉన్నారు. పేలుడు కార‌ణంగా స‌మీపంలోని కార్లు దెబ్బ తిన్నాయ‌ని చెప్పారు ఢిల్లీ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌తీష్ గోల్చా. ఈ ఘ‌ట‌న‌తో 22 కార్లు దెబ్బ‌తిన్నాయ‌ని తెలిపారు. ప్ర‌ధాన ఉగ్ర‌వాద ద‌ర్యాప్తు సంస్థ‌, జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌, జాతీయ భ‌ద్రతా ద‌ళాలు అక్క‌డికి చేరుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో కేంద్ర హోం శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. దేశంలోని ముంబై, జైపూర్, హ‌ర్యానా, కోల్ క‌తా, ఉత్త‌ర ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, హైద‌రాబాద్ ప్రాంతాల‌ను అల‌ర్ట్ చేసింది. బీహార్ లో కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించింది. కేర‌ళ‌లోని అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా భ‌ద్ర‌త‌ను ప‌టిష్టం చేయాల‌ని ఆదేశించారు సీఎం.

Also Read : CM Revanth Reddy Important Update : రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మే కేంద్రంతో దోస్తానా

Exit mobile version