బీజేపీ ఓట్ల చోరీ ముమ్మాటికీ నిజం : అఖిలేష్ యాద‌వ్

స‌ర్ అంటే వేషంలో ఉన్న ఎన్ఆర్సీ అంటూ కామెంట్స్

BJP's vote theft is absolutely true: Akhilesh Yadav

హైద‌రాబాద్ : స‌మాజ్ వాది పార్టీ అధ్యక్షుడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో బీజేపీ మాత్ర‌మే ఉండాల‌ని అనుకుంటోంద‌ని అన్నారు. ఇత‌ర పార్టీలు ఉండ కూడ‌ద‌ని, పూర్తి కాలం త‌మ పార్టీనే ప‌వ‌ర్ లో ఉండాల‌ని ప్లాన్ చేస్తోంద‌ని ఆరోపించారు. హైద‌రాబాద్ లో జ‌రిగే ఏఐ స‌ద‌స్సుకు అఖిలేష్ యాద‌వ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంత‌రం మాజీ మంత్రి కేటీఆర్ ను క‌లిశారు. మీడియాతో మాట్లాడుతూ అఖిలేష్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేంద్రంపై. కేంద్ర ఎన్నిక‌ల సంఘం పూర్తిగా ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. చివ‌ర‌కు డెమోక్ర‌సీపై న‌మ్మ‌కం లేకుండా పోతోంద‌ని వాపోయారు.

సీఈసీ ఎంపిక క‌మిటీలో ప్ర‌ధాన న్యాయ‌మూర్తిని లేకుండా చేశార‌ని ఆరోపించారు అఖిలేష్ యాద‌వ్. స‌ర్ అంటే వేషంలో ఉన్న ఎన్సీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ హైద‌రాబాద్ లో జ‌రిగే విజ‌న్ ఇండియా ఏఐ స‌మ్మిట్ లో త‌న‌కు రావాల్సిందిగా ఆహ్వానించార‌ని తెలిపారు. ఎన్నికల కమిషన్ పెద్ద ఎత్తున తొలగింపులను అనుమతించే బదులు ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టాలని స్ప‌ష్టం చేశారు. ఈసీ ప‌క్ష‌పాత ధోర‌ణి, క‌క్ష సాధింపు ధోర‌ణి కార‌ణంగా ఒక్క ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఏకంగా 3 కోట్ల‌కు పైగా ఓట్లు కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు అఖిలేష్ యాద‌వ్.

Exit mobile version