Minister Ponnam Fired on BJP : బీజేపీ విధానం బీసీల‌కు వ్య‌తిరేకం – పొన్నం

ఎంపీ ల‌క్ష్మ‌ణ్ నిర్వాకంపై తీవ్ర ఆగ్ర‌హం

Hello Telugu - Minister Ponnam Fired on BJP

Hello Telugu - Minister Ponnam Fired on BJP

Minister Ponnam : హైద‌రాబాద్ – బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అసహనంతో మాట్లాడుతున్నాడని మండిప‌డ్డారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. ఆర్డినెన్స్ ఎట్లా చెల్లుబాటు అవుతుంది అని ప్ర‌శ్నించ‌డం త‌న‌కు బీసీల ప‌ట్ల ఎంత ప్రేమ ఉందో అర్థ‌మ‌వుతుంద‌న్నాడు. బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే లోక‌ల్ బాడీ ఎన్నిక‌లు ఆపామ‌న్నారు. మీరు కేంద్రాన్ని ఎందుకు ఒప్పించ‌డం లేదంటూ ప్ర‌శ్నించారు. పూర్తి స్థాయిలో వివ‌రాలు సేక‌రించాకే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. బీజేపీ విధానమే బీసీ వ్య‌తిరేక విధాన‌మ‌న్నారు.

Minister Ponnam Prabhakar Slams BJP

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ (Minister Ponnam) గౌడ్ సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖ‌రిని అవ‌లంభిస్తోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ద‌మ్ముంటే బీసీల‌కు రిజ‌ర్వేష‌న్లు అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌మ ప్ర‌భుత్వం ఇచ్చిన మాట ప్ర‌కారం నిల‌బెట్టుకున్నాడ‌ని, త‌ప్ప‌కుండా 42 శాతం రిజ‌ర్వేష‌న్ల‌ను అమ‌లు చేసి తీరుతామ‌ని ప్ర‌క‌టించారు. మోదీ అడ్డుకున్నా ఆగ‌ద‌న్నారు. త‌మ స్వ‌ప్రయోజ‌నాల కోసం నిన్న‌టి వ‌ర‌కు బీసీల జ‌పం చేసిన వాళ్లు ఏమై పోయారంటూ ప్ర‌శ్నించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

బీసీల‌కు వ్య‌తిరేకంగా ఎవ‌రు మాట్లాడినా ప్ర‌స్తుతం ప్ర‌జ‌లు క్షమించే ప‌రిస్థితుల్లో లేర‌న్నారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము తీసుకు వ‌చ్చిన ఈ చారిత్రాత్మ‌క నిర్ణ‌యానికి బేష‌ర‌తుగా బీసీల‌కు న్యాయం చేయాల‌ని అనుకుంటే కేంద్రం తీర్మానం చేయాల‌ని , చ‌ట్టం చేసి , ఆర్డినెన్స్ జారీ చేయాల‌ని డిమాండ్ చేశారు.

Also Read : Ashok Gajapathi Raju Proven : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

Exit mobile version