Ashok Gajapathi Raju Proven : గోవా గవర్నర్‌గా అశోక్ గజపతి రాజు

హర్యానా గవర్నర్‌గా ఆశిం ఘోష్

Hello Telugu - Ashok Gajapathi Raju Proven

Hello Telugu - Ashok Gajapathi Raju Proven

Ashok Gajapathi Raju : ఢిల్లీ – కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప‌లు రాష్ట్రాలకు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించింది. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ నుంచి ఉత్త‌ర్వులు వెలువ‌డ్డాయి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, సీనియ‌ర్ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అశోక గ‌జ‌ప‌తిరాజుకు (Ashok Gajapathi Raju) ఊహించ‌ని ప‌ద‌వి ద‌క్కింది. ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌రించింది. సౌమ్యుడిగా, వివాద ర‌హితుడిగా, లెక్క‌నేంత ఆస్తులు, సంప‌ద , కోట్లు ఉన్నా సాధార‌ణ‌మైన వ్య‌క్తిగా ఉండేందుకు ఇష్ట‌ప‌డే గ‌జ‌ప‌తిరాజుకు గోవా రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము.

Ashok Gajapathi Raju As a Goa Governor

ఆయ‌న‌తో పాటు జమ్మూ కాశ్మీర్ మాజీ ఉప ముఖ్యమంత్రి కవిందర్ గుప్తా లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఇక అశోక్ గ‌జ‌ప‌తి రాజు గ‌తంలో కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా ప‌ని చేశారు. రాష్ట్ర స్థాయిలో కేబినెట్ లో కూడా మంత్రిగా ప‌ని చేశారు. అపార‌మైన అనుభ‌వం ఆయ‌న‌కు ఉంది. ఇదిలా ఉండ‌గా లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం లెఫ్టినెంట్ గవర్నర్‌గా బ్రిగేడియర్ బి డి మిశ్రా (రిటైర్డ్) రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారని ఉత్తర్వులో పేర్కొంది.

కొత్త గవర్నర్లు తమ పదవులను స్వీకరించే తేదీల నుండి ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్బంగా త‌న‌ను గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించినందుకు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేశారు అశోక గ‌జ‌ప‌తి రాజు.

Also Read : President Droupadi Murmu Approved : ఆ న‌లుగురు రాజ్య‌స‌భ‌కు నామినేట్

Exit mobile version