Madhavilatha : హైదరాబాద్ – బీజేపీ నేత మాధవీలత సీరియస్ కామెంట్స్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా ఫ్రీ బస్సు పథకం పెడితే ఏం లాభం అంటూ ప్రశ్నించారు. మహిళలు టిఫిన్ డబ్బా పట్టుకొని బస్సులలో తిని తిరిగి ఇంటికి రావాలా అంటూ ఎద్దేవా చేశారు. 2 లక్షల జాబ్స్ 12 నెలల్లోనే భర్తీ చేస్తామన్నారని, ఇప్పటి వరకు ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వ పాలన గాడి తప్పిందని ధ్వజమెత్తారు. మహిళలకు ఉచితం వల్ల ఎలాంటి లాభం అంటూ ఉండదన్నారు. దీని వల్ల సర్కార్ కు గండి తప్పా ఒనగూరేది ఏమీ ఉండదన్నారు మాధవీలత.
BJP Leader Madhavilatha Key Comments on Free Bus
సంక్షేమ పథకాల వల్ల ఖజానాకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతుందని, ఇది కాకుండా ఉపాధి కల్పించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు మాధవీలత (Madhavilatha). గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
అదే స్థానంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలగడం లేదన్నారు బీజేపీ నాయకురాలు.కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోందని చెప్పారు. అయినా వాటిని వాడుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
Also Read : MP Mallu Ravi Fired on Komatireddy : వినకపోతే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదు
