MP Mallu Ravi : హైదరాబాద్ – ఎంత చెప్పినా వినకుంటే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదన్నారు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ , ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi). తన వ్యవహారంపై పీసీసీ చీఫ్ చర్చించారని తెలిపారు. వాటిని పరిశీలిస్తున్నానని, తన పని కేవలం మంటలు ఆర్పే పని అని, మంటలు పెట్టే పని కాదన్నారు. పార్టీలో విభేదాలు సరి చేస్తూ, అందరు కలిసి పని చేసేలా చూసే బాధ్యత నాదన్నారు. వరంగల్ జిల్లా నేతల మధ్య పంచాయితీపై కూడా నలుగురు సభ్యులతో కమిటీని పార్టీ నియమిస్తుందన్నారు. రెండు గ్రూపులను కూర్చొబెట్టి కమిటీ మాట్లాడుతుందని చెప్పారు.
MP Mallu Ravi Slams Komatireddy Raj Gopal Reddy
ఆదివారం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం పార్టీలో మునుగోడు ఎమ్మెల్యే వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలో కొలువు తీరిన సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. అంతకు మించి సీఎం ఎ. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తెలంగాణకు చెందిన కాంట్రాక్టర్లను పట్టించు కోవడం లేదన్నారు. తన వెనుక 20 మంది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నాడంటూ మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ మొత్తం వ్యవహారంపై ఏఐసీసీ సీరియస్ అయ్యింది. దీనిపై వెంటనే విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మనాక్షి నటరాజన్ ఆదేశించారు.
ఇదే అంశానికి సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెంటనే సమస్య పరిష్కరించేందకు చొరవ చూపాలని కోరారు. దీంతో ఇవాళ మునుగోడు ఎమ్మెల్యేతో పాటు వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న నేతల మధ్య అభిప్రాయాలపై కూడా విచారణ జరుగుతుందన్నారు మల్లు రవి.
Also Read : EPFO Important Updates : అసలు మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బు ఎన్నిసార్లు తీసుకోవచ్చు?
