Bitcoin : ప్రపంచంలో అతి పెద్ద క్రిప్టోకరెన్సీగా పేరుగాంచిన బిట్‌కాయిన్ మరోసారి చరిత్ర సృష్టించింది. ఆదివారం ట్రేడింగ్ సమయంలో బిట్‌కాయిన్ ధర ఒక దశలో 1,25,245.57 అమెరికన్ డాలర్లకు చేరి కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఇది శనివారపు ధరతో పోలిస్తే సుమారు 2.7 శాతం ఎక్కువగా ఉంది.
Bitcoin Growth
ఈ పెరుగుదలతో బిట్‌కాయిన్ (Bitcoin) మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ను కూడా అధిగమించింది. దీని ద్వారా క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్ ఆధిపత్యం మరింత బలపడింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇటీవల సంస్థాగత మదుపరులు భారీగా బిట్‌కాయిన్ కొనుగోళ్లు చేయడం, అలాగే ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న సానుకూల విధానాలు, మరియు డాలర్ విలువ ప్రధాన కరెన్సీలతో పోలిస్తే బలహీనపడడం వంటి అంశాలు బిట్‌కాయిన్ ధర పెరుగుదలకు దోహదం చేస్తున్నాయి.
ఇక అమెరికా ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలు స్తంభించటం కూడా మార్కెట్‌లో బిట్‌కాయిన్ వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై ఆసక్తిని పెంచింది. ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న వేళలో, బిట్‌కాయిన్‌ను పెట్టుబడిదారులు “డిజిటల్ గోల్డ్”గా భావిస్తూ సురక్షిత ఆస్తిగా మళ్లీ ఆశ్రయిస్తున్నారు.
నిపుణులు బిట్‌కాయిన్ ధరలో ఈ వేగవంతమైన పెరుగుదల కొంతకాలం కొనసాగవచ్చని, అయితే భవిష్యత్తులో తాత్కాలిక సవరణలు సంభవించే అవకాశమూ ఉన్నదని చెబుతున్నారు.
Also Read : Stock Market Growth : బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల కొనుగోళ్లతో మార్కెట్ లాభాల దిశగా
