Ghaati : సృజనాత్మక దర్శకుడిగా పేరు పొందాడు క్రిష్ జాగర్లమూడి. తను దర్శకత్వం వహించి అర్ధాంతరంగా వదిలి వేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీరమల్లు. అది విడుదలైంది. కానీ వర్కవుట్ కాలేదు. ఎక్కడా మెగా పేరు, ఇమేజ్ కాపాడలేక పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో క్రిష్ జాగర్లమూడి తన భార్యకు విడాకులు ఇచ్చాడు. మనోడు ఓ డాక్టర్ ను మరో పెళ్లి చేసుకున్నాడు. సినిమా రంగంలో ఏ ఒక్కరు సరిగా ఉండరన్న దానికి తను ఓ నిదర్శనం. తాజాగా మనోడు గతంలో వేదం పేరుతో సినిమా తీశాడు. ఇది సామాజిక సందేశాత్మక చిత్రం. ఇందులో కీ రోల్ పోషించింది లవ్లీ బ్యూటీ అనుష్క శెట్టి. తాజాగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు ఘాటి (Ghaati). ఇందులో ముఖ్య భూమిక పోషించింది ముద్దుగుమ్మ.
Anushka Ghaati OTT Rights
ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది. దీనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. . అగ్ర నటి అనుష్క శెట్టి, ప్రముఖ తమిళ నటుడు శివాజీ గణేషన్ మనవడు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి చింతకింద శ్రీనివాస్ రచన చేశారు. రాజీవ్ రెడ్డి , సాయిబాబు జాగర్లముడి సంయుక్తంగా నిర్మించారు. ఘాటిలో చైతన్య రావు మదాడి, జగపతి బాబు, జిషు సేన్‌గుప్తా, జాన్ విజయ్, రవీంద్ర విజయ్ , వీటీవీ గణేష్ కూడా ఉన్నారు. ఉత్తర అమెరికా, ఇతర విదేశీ మార్కెట్లలో ప్రత్యేక ప్రీమియర్ షోలు జరిగాయి. మంచి ఆదరణ లభించడంతో ఓటీటీ సంస్థలు ఘాటిని చేజిక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరకు అమెజాన్ ప్రైమ్ సంస్థ ఘాటిని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.
Also Read : Nag Ashwin-Ticket Price : సినిమా టికెట్ ధరలపై జీఎస్టీ తగ్గించాలి : నాగ్ అశ్విన్
