DY CM Bhatti Vikramarka Important Update : తెలంగాణ రైజింగ్ 2047 విజ‌న్ డాక్యుమెంట్

రోల్ మోడ‌ల్ గా ఉండాల‌న్న డిప్యూటీ సీఎం

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Update

Hello Telugu - DY CM Bhatti Vikramarka Important Update

Bhatti Vikramarka : హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చే నెల డిసెంబ‌ర్ లో రెండు రోజుల పాటు ప్ర‌తిష్టాత్మ‌కంగా తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ 2025 నిర్వ‌హిస్తోంది. ఈ సంద‌ర్బంగా డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స‌మీక్ష చేప‌ట్టారు. వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశం అయ్యారు. దేశంలోనే రోల్ మోడ‌ల్ గా ఉండేలా తెలంగాణ రైజింగ్ -2047 విజ‌న్ డాక్యుమెంట్ త‌యారు చేయాల‌ని ఆదేశించారు. ఫోర్త్ సిటీ వేదిక‌గా జ‌రిగే ఈ స‌మ్మిట్ కు దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు త‌ర‌లి వ‌స్తున్నార‌ని చెప్పారు. వారంద‌రికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆదేశించారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

DY CM Bhatti Vikramarka Key Comments

2034 నాటికి వన్ ట్రిలియన్, 2047 నాటికి త్రీ ట్రిలియన్ ఎకానమీ లక్ష్యాన్ని సాధించడానికి ఈ విజన్ డాక్యుమెంట్ రోడ్ మ్యాప్ గా ఉండబోతోందని చెప్పారు. తెలంగాణ కోర్ అర్బన్, అర్బన్, రూరల్ ఏరియాల్లో రాబోయే పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, వ్యవసాయ అభివృద్ధి, విద్యా, వైద్యం, పేదల సంక్షేమం, విద్యుత్, సాగునీరు, గ్రామీణాభివృద్ధి తదితర రంగాల విజన్ డాక్యుమెంట్స్ రూపకల్పనలో క‌లీకంగా ఉండేలా చూడాల‌ని సూచించారు డిప్యూటీ సీఎం. గ్లోబ‌ల్ స‌మ్మిట్ ను విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌తిఒక్క‌రు పాలు పంచుకోవాల‌ని సూచించారు. ఒక్కో విభాగానికి ఒక్కో సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

Also Read : DY CM Pawan Kalyan Important Update : ప్రతి పల్లెకు సదుపాయం ప్రతి ఇంటికి సౌభాగ్యం

Exit mobile version