Bhagavanth Kesari : ఢిల్లీ – ప్రతిష్టాత్మకమైన 71వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ తెలుగు చిత్రంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, శ్రీలీల కలిసి నటించిన చిత్రం భగవంత్ కేసరి (Bhagavanth Kesari) ఎంపికైంది. 2023వ సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికైన వారి వివరాలతో కూడిన జాబితాను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్ , ఎల్. మురుగన్ కు అందజేశారు జ్యూరీ సభ్యులు. ఇందులో భాగంగా ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ మూవీ, ఉత్తమ డైరెక్టర్, బాలల చిత్రం, తదితర విభాగాలలో విజేతలను ఎంపిక చేశారు.
Bhagavanth Kesari Gets Best Telugu Film Award
ఉత్తమ నటుడి అవార్డు ఈసారి ఇద్దరిని వరించింది. జవాన్ కు గాను షారుక్ ఖాన్ , 12 ఫెయిల్ మూవీకి గాను విక్రాంత్ మస్సేకు దక్కింది. జాతీయ ఉత్తమ సినిమాగా 12th ఫెయిల్ ఎంపికైంది. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తోసేన్ ని ప్రకటించారు. తెలుగు సినిమాలకు పలు అవార్డులు దక్కడం విశేషం. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ కింద హనుమాన్ చిత్రానికి అవార్డు లభించింది. దిల్ రాజు నిర్మించిన బలగం వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాకు పురస్కారం దక్కింది. ఇందులో ఊరు పల్లెటూరు పాట రాసిన కాసర్ల శ్యామ్ కు ఉత్తమ గేయ రచయిత లభించింది.
ఉత్తమ స్క్రీన్ ప్లే కింద బేబీ, నీలం చిత్రాలకు దక్కగా ఉత్తమ మేల్ ప్లే బ్యాక్ సింగర్ గా బేబీ సినిమాలో బేబి పాట పాడిన రోహిత్ , ఉత్తమ బాల నటిగా పుష్ప దర్శకుడు సుకుమార్ కూతురు వేణి ని వరించింది.
Also Read : Popular Producer Naga Vamsi : ఏ సినిమాకు వంద శాతం చప్పట్లు రావు
