శుభ్ మ‌న్ గిల్ కు బీసీసీఐ బిగ్ షాక్

టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో ద‌క్క‌ని చోటు

hellotelugu-ShubhManGill

ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం ముంబై వేదిక‌గా కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా 2026లో జ‌రిగే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించారు. మొత్తం 15 మంది ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు వెల్ల‌డించారు. స‌మావేశం ముగిసిన అనంత‌రం అగార్క‌ర్ , కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ తో క‌లిసి మీడియాతో మాట్లాడారు. అంద‌రూ శుభ్ మ‌న్ గిల్ ను కంటిన్యూ చేస్తార‌ని అంతా భావించారు. కానీ ఊహించ‌ని షాక్ ఇచ్చారు సెల‌క్షెన్ క‌మిటీ చైర్మ‌న్. గ‌త కొంత కాలంగా శుభ్ మ‌న్ గిల్ ఆట‌గాడిగా పూర్తిగా విఫ‌లం అవుతూ వ‌చ్చాడు. త‌న‌ను కంటిన్యూగా ఎంపిక చేయ‌డం, త‌ను విఫ‌లం కావ‌డం తో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా విమ‌ర్శ‌లు ఎదుర‌య్యాయి. ఆడ‌క పోయినా ఎలా ఆడిస్తున్నారంటూ మండిప‌డ్డారు.

దీంతో దెబ్బ‌కు సెలెక్ష‌న్ క‌మిటీ దిగి వ‌చ్చింది. తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రు టి20 మ్యాచ్ లో ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్ల‌కు చుక్క‌లు చూపించాడు కేర‌ళ స్టార్ సంజూ శాంస‌న్. దీంతో త‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ లో అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి శాంస‌న్ ఓపెనింగ్ చేస్తాడ‌ని ప్ర‌క‌టించాడు. ముగ్గురు వికెట్ కీప‌ర్ల‌ను కూడా తీసుకున్నామ‌న్నాడు. వారిలో శాంస‌న్, జితేశ్ శ‌ర్మ‌, ఇషాన్ కిష‌న్ ఉంటాడ‌ని తెలిపాడు. ఇక గ‌త 30 మ్యాచ్ ల‌లో 291 ర‌న్స్ మాత్ర‌మే చేయ‌డంతో గిల్ ను త‌ప్పించాల్సి వ‌చ్చింద‌న్నాడు అగార్క‌ర్.

ఇక జ‌ట్టు ప‌రంగా చూస్తే సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

Exit mobile version