తెలంగాణలో ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’

రూ.22 కోట్లు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం

KheloIndiaYouthGames20026.jpg

xr:d:DAFhnTjaf4w:45,j:46891572809,t:23051021

హైద‌రాబాద్ : భారతదేశ యువశక్తికి సరైన క్రీడా సదుపాయాలను, అవసరమైన ప్రోత్సాహాన్ని కల్పించి.. వారిలోని శక్తి సామర్థ్యాలకు పదును పెట్టడంతో పాటు, క్రీడారంగంలో ఉజ్వలమైన భవిష్యత్తును అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. యువ క్రీడాశక్తిని ప్రోత్సహించేందుకు గాను ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’, ‘ఖేలో ఇండియా పారా గేమ్స్’, ‘ఖేలో ఇండియా వింటర్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా బీచ్ గేమ్స్’, ‘ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్’, ‘ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్’ వంటి క్రీడాపోటీలను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఈ ఏడాది జరగనున్న 8వ ఎడిషన్ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ ను తెలంగాణలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ వేదికగా ఈ పోటీలను నిర్వహించనున్నారు. మొత్తం 25 క్రీడల్లో పోటీలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 6వేల మంది క్రీడాకారులు పాల్గొంటారని అంచనా. ఈ పోటీల‌ను డిసెంబర్ నెల‌లో నిర్వ‌హించేందుకు నిర్ణ‌యించారు.

ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లను విడుదల చేసింది. ఈ క్రీడాపోటీలను రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా , నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ , స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా , సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్, ఖేలో ఇండియా పథకం అడ్ హక్ కమిటీ, స్టీరింగ్ కమిటీల సంయుక్త నిర్వహణలో నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను తెలంగాణకు కేటాయించడం పట్ల.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర యువజన సర్వీసులు, క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు. భారత యువతలో అపారమైన క్రీడా ప్రతిభ ఉందని, వారికి తగిన క్రీడా సదుపాయాలు కల్పించడం, అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం, ప్రతిభను వెలికి తీయడంలో గత ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహించాయన్నారు. స్పోర్ట్స్ బడ్జెట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని పేర్కొన్నారు.

Exit mobile version