టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026లో టీమిండియా స్క్వాడ్

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న బీసీసీఐ

hellotelugu-BCCIAnnounce

ముంబై : ఎవ‌రూ ఊహించ‌ని విధంగా బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా వ‌చ్చే ఏడాది 2026 ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. అధికారంగా వివ‌రాలు వెల్ల‌డించింది. ఈ సంద‌ర్బంగా వైస్ కెప్టెన్ గా ఉన్న శుభ్ మ‌న్ గిల్ ను త‌ప్పించింది స్క్వాడ్ నుంచి. ఇది ప్ర‌తి ఒక్క‌రినీ విస్తు పోయేలా చేసింది. ఈ సంద‌ర్బంగా వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే జ‌ట్టును శ‌నివారం ప్ర‌క‌టించారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. ఈ సంద‌ర్బంగా జ‌ట్టుకు య‌ధావిధిగా సూర్య కుమార్ యాద‌వ్ స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తార‌ని వెల్ల‌డించారు.
ఇదిలా ఉండ‌గా శుభ్ మ‌న్ గిల్ స్థానంలో వైస్ కెప్ట‌న్ గా అక్ష‌ర్ ప‌టేల్ ను నియ‌మించామ‌న్నాడు.

టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా జట్టు ప్రకటనకు సంబంధించి బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో సెలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియా 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. అయితే వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ కోసం ఎంపిక చేశారు. ఇదే జట్టు జనవరిలో జరగనున్న న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో కూడా ఆడుతుందని స్ప‌ష్టం చేశారు అజిత్ అగార్క‌ర్. కాగా టీమ్ ఇండియా జ‌ట్టు ఇలా ఉంది.

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).

Exit mobile version