BC Janardhan Reddy : అమరావతి – బనకచర్ల ప్రాజెక్టు ఏపీ సాగునీటి రంగ చరిత్రలో గేమ్ ఛేంజర్ కానుందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (BC Janardhan Reddy) ఆశాభావం వ్యక్తం చేశారు. నందికొట్కూరు నియోజకవర్గం, జుపాడుబంగ్లా మండలంలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్యలతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కృష్ణా జలాలను విడుదల చేశారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద కృష్ణా జలాలను విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టులో 878.90 అడుగుల నీరు ఉందన్నారు.
BC Janardhan Reddy – Banakacherla Project
గతంలో జూలై 27 వ తేదీ, అంతకు ముందు ఆగస్టులో నీళ్లు విడుదల చేయడం జరిగిందని వివరించారు. ఎగువన వర్షాలు కురుస్తున్న కారణంగా 673.99 క్యూసెక్కుల జలాలు రెగ్యులర్‌గా వచ్చి చేరుతున్న నేపథ్యంలో సకాలంలో రైతులకు పంటలు పండే విధంగా పోతిరెడ్డిపాడు నుంచి తెలుగుగంగ, గాలేరు – నగరి సుజల స్రవంతి, హంద్రీ – నీవా సుజల స్రవంతి, ఎస్‌ఆర్‌బీసీ కాలువలకు నీటిని విడుదల చేసినట్లు చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి జలాలను వృధా కాకుండా అవసరం ఉన్నంత మేరకే విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రైతులందరీకీ సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నట్లు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి (BC Janardhan Reddy) తెలిపారు. ప్రతి చెరువును, కుంటను నింపాలన్నదే తమ సర్కార్ లక్ష్యమని స్పష్టం చేశారు. అలగనూరు బండ మరమ్మత్తులు, గోరుకల్లు రిజర్వాయర్ మరమ్మత్తులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
. గత వైకాపా పాలకుల పాపాల వల్లే అలగనూర్ రిజర్వాయర్ బండ కుంగిపోయిందని ధ్వజమెత్తారు. వైసీపీ శ్రద్ధ పెట్టి ఉంటే 20 నుండి 30 కోట్లతో పూర్తి అయ్యేదన్నారు. కానీ జగన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా అది ఇప్పుడు రూ. 100 కోట్లకు చేరుకుందన్నారు.
Also Read : Tirupati Govindaraja Swami Interesting : గోవిందరాజ స్వామి ఆలయంలో ఘనంగా జ్వేష్టాభిషేకం
