బిగ్ టీవీ ఛానల్ ను తెలంగాణలో బ్యాన్ చేయాలి

బీసీ జేఏసీ సంచ‌ల‌న కామెంట్స్, దిష్టి బొమ్మ ద‌గ్దం

hellotelugu-BCLeaders

హైద‌రాబాద్ : బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన టీపీసీసీ చీఫ్ బొమ్మ‌గాని మ‌హేష్ కుమార్ గౌడ్ ను కించ ప‌రిచేలా, త‌న వ్య‌క్తిత్వానికి భంగం క‌లిగించేలా సీఎం రేవంత్ ఎడ్డికి చెందిన బిగ్ టీవీ ఛాన‌ల్ వార్త‌ల‌ను, క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది బీసీ జేఏసీ. బిగ్ టివి అసత్య కల్పిత కథనాల ను ఖండిస్తూ ఈరోజు బిగ్ టివి యాజమాన్యం దిష్టి బొమ్మను దగ్ధం చేశాయి బీసీ సంఘాలు. బడుగులను అవమానించే బిగ్ టీవీ ఛానల్ ను తెలంగాణలో బ్యాన్ చేయాలని బీసీ జేఏసీ నేత‌లు డిమాండ్ చేశారు. బీసీలను రాజకీయంగా ఎదగకుండా కుట్రలు చేస్తున్న అగ్రకుల మీడియా సంస్థ యాజమాని వెంటనే పిసిసి అధ్యక్షునికి క్షమాపణలు చెప్పాలని, లేక‌పోతే పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని వార్నింగ్ ఇచ్చారు.

బీసీలపై విషం చిమ్ముతూ బిగ్ టీవీ చేసినటువంటి డిజాస్టర్ పిసిసి అధ్యక్షుడు అని అనడంలో అంతర్యం ఏమిటి అని ప్ర‌శ్నించారు. బీసీలను పార్టీ పదవులలో, ప్రభుత్వ పదవుల్లో మానసికంగా ఇబ్బంది పెడుతూ వ్యక్తిత్వ హననం చేస్తున్న అగ్రకుల మీడియా సంస్థపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంకోసారి ఇలాంటి చెత్త వార్త‌ల‌ను ప్ర‌సారం చేస్తే దాడుల‌కు దిగాల్సి వ‌స్తుంద‌న్నారు. వెంటనే పిసిసి అధ్యక్షునికి బిగ్ టివి యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని బీసీ సంఘాల నేతలు కుందారం గణేష్ చారి, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రమ్ గౌడ్ డిమాండ్ చేశారు .కొంతమంది అగ్రకులాల నాయకులు కొంతమంది మీడియా సంస్థలను అడ్డం పెట్టుకొని బీసీలను కుట్రలు చేసి వ్యక్తిత్వ హరణం చేసి చిన్నచూపు చూసే విధంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు .

Exit mobile version