Bandi Sanjay : హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ పై. ఆ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకు పోయిందన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తామంటూ ప్రతిపాదన చేసింది వాస్తవమేనని అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. కేటీఆర్‌కి టికెట్ ఇవ్వాలని సీఎం రమేష్‌ని కలిసిన మాట వాస్తవమేనని చెప్పారు. తను చేసిన సాయం వల్లనే ఆనాడు ఎమ్మెల్యేగా గెలుపొందాడని బాంబు పేల్చారు.
Union Minister Bandi Sanjay Key Comments
బీఆర్‌ఎస్‌ను నడిపే స్థితిలో లేకనే బీజేపీలో విలీనం చేస్తానన్నారని ఆరోపించారు. ఆనాడు అలా చెప్పి ఇప్పుడు మాట మారిస్తే ఎలా అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్ పటేల్. రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో 80 శాతం హిందువులు ఏకమవుతారని అన్నారు. కామారెడ్డిలో చేసింది బీసీ డిక్లరేషన్ కాదు, ముస్లిం డిక్లరేషన్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. కొత్తగా బీసీలకు పెరిగేది 5 శాతం మాత్రమేనని, అయితే ముస్లింలకు 10 శాతం పెరుగుతుందన్నారు.
ఇది బీసీ రిజర్వేషన్ కాదు, ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లు అంటూ మండిపడ్డారు. కచ్చితంగా బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకుంటామని వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి.. హిందువులను రాహుల్ గాంధీ హేళన చేస్తున్నాడని ఆరోపించారు. హిందూ ధర్మం అంతు చూస్తా అని రాహుల్ అంటున్నారని ఆయన తరం కాదన్నారు.
Also Read : Test Tube Baby Scam : ‘సృష్టి’లో అసలు సరోగసి అన్నదే లేదు
















