Balka Suman Shocking Comments on CM : బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్న సీఎం

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ షాకింగ్ కామెంట్స్

Hello Telugu - Balka Suman Shocking Comments on CM

Hello Telugu - Balka Suman Shocking Comments on CM

Balka Suman : హైద‌రాబాద్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ (Balka Suman) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డిపై మండిప‌డ్డారు. తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి బెదిరింపు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని, జ‌నం గ‌మ‌నిస్తున్నార‌ని అన్నారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తే ఎవ‌రూ ఊరుకోర‌ని గుర్తు పెట్టుకుంటే మంచిద‌న్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లను బెదిరించే విధంగా సీఎం మాట్లాడటం మంచి ప‌ద్ద‌తి కాద‌ని హిత‌వు ప‌లికారు. ఏ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓటర్లను భయ పెట్టలేదన్నారు. బోరబండలో కాంగ్రెస్ వేధింపులు తట్టుకోలేక సర్దార్ అనే బీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బాల్క సుమ‌న్. వ్యాపారాలు ఉన్న బీఆర్ఎస్ నేతలను బెదిరిస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందన్నారు.

Balka Suman Slams CM

బీఆర్ఎస్ కార్యకర్త రియాజ్ ఇళ్ళు కూలగొట్టి దాడి చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిరుద్యోగులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తే వారిని కూడా బెదిరించార‌ని ఫైర్ అయ్యారు బాల్క సుమ‌న్ . కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వయంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. త‌ను రేవంత్ రెడ్డిని ఫాలో అవుతున్నార‌ని అన్నారు. న‌వీన్ యాద‌వ్ త‌మ్ముడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఉన్నాడని ఆరోపించారు. నేర చరిత్ర ఉన్న వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం ఎట్లా అనుమతి ఇచ్చిందని ప్ర‌శ్నించారు. బాంబుల మంత్రి బీహార్‌లో మిగిలిన 30 వేల కుక్కర్లను పంచాలని చూస్తున్నార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. అధికారులు, పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి తాను మున్సిపల్ శాఖా మంత్రి, హోంమంత్రి అనే విషయాన్ని మర్చి పోయారంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Minister Savitha Fired on YS Jagan : బీసీల పేరుతో జగన్ డైవర్షన్ పాలిటిక్స్

Exit mobile version