Baahubali The Eternal War : హైదరాబాద్ : భారతీయ సినిమాను అత్యంత ప్రభావితం చేసిన దర్శకులలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. తను ప్రస్తుతం సంచలనంగా మారారు. ప్రిన్స్ మహేష్ బాబు, అందాల తార ప్రియాంక చోప్రాతో కలిపి ఓ అడ్వెంచరిక్ మూవీ తెరకెక్కించే పనిలో పడ్డాడు. విచిత్రం ఏమిటంటే తన సినీ కెరీర్ లోనే ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ సెట్టింగ్స్ వేశాడు. ఇది ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చకు దారి తీసేలా చేసింది. మరో వైపు తను తీసిన బాహుబలి మూవీ ఇప్పటికే రికార్డుల మోత మోగించింది. అత్యధిక కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఈ తరుణంలో ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్పటికే సక్సెస్ అయిన సినిమాలను తిరిగి రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగానే జక్కన్న దర్శకత్వం వహించిన బాహుబలిని (Baahubali The Eternal War) రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది.
Baahubali The Eternal War Movie Release Updates
ఇందులో భాగంగా బాహుబలి ది ఎటర్నల్ వార్ మూవీకి సంబంధించి టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మూవీ మేకర్స్. ఇది ప్రేక్షకులకు అమరేంద్ర బాహుబలి యానిమేటెడ్ రిటర్న్ జీవితాంతం కనిపించేలా చేసింది. స్టార్ వార్స విజన్స్, షిర్కోవా , కల్కి చిత్రాలపై తన పనికి ప్రసిద్ధి చెందిన ఇషాన్ శుక్లా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ – పురాణ యానిమేటెడ్ ఫార్మాట్ ద్వారా పురాణ యోధుడి వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళుతుందని హామీ ఇచ్చింది. యుద్ధంలో దైవిక శక్తులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న రథంపై అమరేంద్ర బాహుబలి గ్రాండ్ ఎంట్రీతో ముగుస్తుంది. దృశ్య పరంగా విడుదల చేసిన టీజర్ సూపర్ గా ఉంది. నెటిజన్లు, ప్రేక్షకులు సైతం మెస్మరైజ్ అయ్యారు ఈ టీజర్ ను చూసి.
Also Read : DGP Shivadhar Reddy Warning : డ్రగ్స్ ప్రమాదం అప్రమత్తత అవసరం
