‘రాకా’ చిత్రంపై స్టంట్ కొరియాగ్రాఫ‌ర్ షాకింగ్ కామెంట్స్

మోష‌న్ క్యాప్చ‌ర్ షాట్స్ అత్యంత అవ‌స‌రం

hellotelugu-RAAKA

చెన్నై : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపుతోంది అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం రాకా . ఇందులో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, దీపికా ప‌దుకొనే ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్నారు. చిత్రానికి సంబంధించి షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. హాలీవుడ్ స్థాయిలో దీనిని తీస్తున్నాడు ద‌ర్శ‌కుడు. ఇప్ప‌టికే త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ద‌ర్శ‌కుడిగా పేరు పొందాడు అట్లీ. త‌ను స్టార్ హీరోలతో తీసిన సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచేలా చేశాయి. ముఖ్యంగా ప్ర‌స్తుత త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్ర‌శేఖ‌ర్ తో తీసిన మూవీ విజిల్ దుమ్ము రేపింది. దేశాన్ని ఒక ఊపు ఊపింది. ఈ చిత్రంలో కేంద్ర స‌ర్కార్ ను, అది విధించిన జీఎస్టీని ప్ర‌స్తావించాడు ద‌ర్శ‌కుడు. ఇదిలా ఉండ‌గా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏకంగా రూ. 1000 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అట్లీ కుమార్.

తాజాగా రాకాకు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ‘రాకా’ చిత్రానికి మోషన్ క్యాప్చర్ షాట్లు అత్యంత అవసరమని పేర్కొన్నాడు యాక్షన్ కొరియోగ్రాఫర్. అల్లు అర్జున్ , అట్లీ కలయికలో రాబోతున్న ‘రాకా’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ పూర్తికాక ముందే మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించి నందుకు ఈ చిత్రం గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కింది. ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2027 చివరలో లేదా 2028లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్టంట్ కొరియోగ్రాఫర్ అనల్ అరసు ఈ మోషన్ క్యాప్చర్ సాంకేతికత గురించి మరిన్ని వివరాలను పంచుకున్నారు. ‘రాకా’ ప్రపంచంలో విలక్షణమైన పాత్రలు ఉంటాయని, వాటిలో కొన్ని అతీంద్రియ శక్తులను కలిగి ఉంటాయని ఆయన తెలిపారు. ఇది అందరిలోనూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

గతంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రంలో బాడీ డబుల్స్ కోసం మోషన్ క్యాప్చర్ సాంకేతికతను ఉపయోగించినప్పటికీ ‘రాకా’లో దీనిని మరింత విస్తృతంగా, అత్యున్నత స్థాయిలో వాడుతున్నట్లు చెప్పారు.

Exit mobile version