హైద‌రాబాద్ లో స్విస్ మాల్ ఏర్పాటు చేయండి

వాడ్ ఖండం సీఎంను కోరిన రేవంత్ రెడ్డి

hellotelugu-ReaavanthReddy

దావోస్ : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌స్తుతం దావోస్ లో ప‌ర్య‌టిస్తున్నారు. త‌న నేతృత్వంలో మంత్రుల‌తో క‌లిసి కంపెనీల ప్ర‌తినిధుల‌తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్‌లోని వాడ్ ఖండం ముఖ్యమంత్రి క్రిస్టెల్లె లూయిసియర్ బ్రోడార్డ్‌ను కలిశారు. హైదరాబాద్‌లో “స్విస్ మాల్” ఏర్పాటును ప్రతిపాదించారు, దీనికి వాడ్ నాయకత్వం నుండి సానుకూల స్పందన వచ్చింది. భారతదేశం-స్విట్జర్లాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సందర్భంలో, బహుళ రంగాలలో త‌మ‌ రెండు ప్రాంతాల మధ్య లోతైన సహకారం కోసం మార్గాలను తాము చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు.

ఆతిథ్య నిర్వహణ, క్రీడలకు సంబంధించిన రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాల‌ని కోరామ‌న్నారు సీఎం, సంస్కృతి, విద్య, నైపుణ్య అభివృద్ధి, శిక్షణలో పరస్పర సహకారం కోసం అవకాశాలను మేము అన్వేషించామ‌న్నారు రేవంత్ రెడ్డి. మహిళా సాధికారతపై కూడా అర్థవంతమైన మార్పిడి జరిగిందన్నారు. మహిళల సంక్షేమం కోసం తెలంగాణ చొరవలు, ఆర్థికంగా , సామాజికంగా మహిళలకు సాధికారత కల్పించడంలో స్వయం సహాయక బృందాలు పోషించిన కీలక పాత్ర గురించి సీఎంకు వివ‌రించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా వాడ్ ప్రతినిధి బృందం ఆసక్తిని వ్యక్తం చేసిందన్నారు. సంఘాల నమూనాను ప్రత్యక్షంగా అధ్యయనం చేయడానికి త్వరలో తెలంగాణను సందర్శించాలనే ఉద్దేశ్యాన్ని వ్య‌క్తం చేయ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. వారిని సాద‌రంగా ఆహ్వానించాన‌ని తెలిపారు రేవంత్ రెడ్డి.

Exit mobile version