Hindustan : హైదరాబాద్ : ఒకప్పుడు భారతీయ రోడ్లపై పరుగులు తీసిన అంబాసిడర్ అనుకోకుండా ఆగి పోయింది. తిరిగి మరోసారి అలరించేందుకు, దుమ్ము రేపేందుకు ఇవాళ దేశం ముందుకు వచ్చింది. సో ద కింగ్ ఈజీ బ్యాక్ . మొత్తంగా హిందూస్థాన్ కంపెనీ (Hindustan) తను తయారు చేసిన అంబాసిడర్ న్యూ మోడల్ ను లాంచ్ చేసింది గ్రాండ్ గా. భారతీయ రోడ్లపై ఒకప్పుడు రాజసం ఒలక బోసింది ఈ కారు. కోట్లాది మంది భారతీయుల జ్ఞాపకాలతో ముడిపడి ఉంది ఈ వాహనం. ది ఐకాన్ ఈజ్ బ్యాక్ అనే నినాదంతో వస్తున్న ఈ కొత్త మోడల్ తన పాత క్లాసిక్ రెట్రో లుక్‌ను నిలబెట్టుకుంటూనే, ఆధునిక ఫీచర్లతో , నూతన టెక్నాలజీతో వచ్చింది.
Hindustan Company New Innovation
అంబాసిడర్ 2025 కు సంబంధించి కీలక మార్పులు చేసింది డిజైన్ లో. క్లాసిక్ రౌండెడ్ బాడీ షేప్‌ను ఉంచుతూనే లెడ్ హెడ్ ల్యాంప్స్ ను అమర్చింది. క్రోమ్ గ్రిల్ వంటి ఆధునిక హంగులు జోడించారు ఈ వెహికిల్ కు. ధర సుమారు మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం రూ. 12.5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ఉండనుంది. అయితే ఈధరల్లో తేడాలు ఉంటాయి. వేరియంట్ , మార్కెట్ ను బట్టి వీటి ధర ఉండనుంది. ఇక అంబాసిడర్ కారు కొత్త మోడల్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, ఈవీ వేరియంట్ లో కూడా రానుందని సమాచారం. పెట్రోల్ వేరియంట్‌లో ఒక లీటర్ కు 8 కిలోమీటర్లు ఇస్తుంది.
ఇక అంబాసిడర్ వాహనంలో బిగ్ డిజిటల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్ బ్యాగ్‌లు, ఏబీఎస్ , ప్రీమియం ఇంటీరియర్ వంటి అత్యాధునిక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు విడుదల కేవలం ఒక కొత్త మోడల్ లాంచ్ కాదు, ఒక చరిత్ర పునరాగమనం. పాత తరానికి నాస్టాల్జియాను, కొత్త తరానికి యూనిక్ స్టైల్‌ను అందించేందుకు ఇది సిద్ధమవుతోంది.
Also Read : Minister Srinivasa Varma Important Update : స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి
