Ashwini Vaishnaw – Railway New Innovation : సెప్టెంబ‌ర్ 9 నుంచి భార‌త్ గౌర‌వ్ టూరిస్ట్ రైలు

ప్ర‌క‌టించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణ‌వ్

Hello Telugu - Ashwini Vaishnaw - Railway New Innovation

Hello Telugu - Ashwini Vaishnaw - Railway New Innovation

Ashwini Vaishnaw : కేంద్ర రైల్వే శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుంచి ప్ర‌యాణీకుల‌కు మంచి అనుభూతిని క‌లిగించేలా జ‌ర్నీని ఏర్పాటు చేసిన‌ట్లు వెల్ల‌డించారు మంత్రి అశ్విని వైష్ణ‌వ్ (Ashwini Vaishnaw). ఇందులో భాగంగా భార‌త్ గౌర‌వ్ రైలు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్ట‌డం జ‌రిగింద‌న్నారు. అత్యాధునిక వ‌స‌తులు క‌లిగిన ఈ ట్రైన్ వ‌చ్చే నెల సెప్టెంబ‌ర్ 9వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంద‌న్నారు. ఈ ప్రయాణం తొమ్మిది రాత్రులు, పది పగళ్లు ఉంటుందని వెల్ల‌డించారు. ఇందులో రైలు, రోడ్డు ప్రయాణం, వసతి, అన్ని కోచ్‌లలో IRCTC సిబ్బంది పూర్తి సహాయం రెండూ ఉంటాయ‌ని తెలిపారు. ఈ రైలు సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బైద్యనాథ్ ధామ్‌తో అయోధ్య-కాశీ పుణ్య క్షేత్ర యాత్రను కవర్ చేసేలా భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలును ప్రారంభించినట్లు IRCTC ప్రకటించింది.

Union Railway Minister Ashwini Vaishnaw Key Updates

ఈ రైలు సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి బయలు దేరుతుంది. ఈ తీర్థయాత్ర పర్యటన ఒడిశాలోని జగన్నాథ ఆలయం , కోణార్క్ సూర్య దేవాలయం, జార్ఖండ్‌లోని బాబా బైద్యనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ ఆలయం, కారిడార్, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణ దేవి ఆలయం, గంగా ఆరతి, రామ జన్మభూమి, హనుమాన్‌గరి, ఉత్తరప్రదేశ్‌లోని త్రివేణి సంగమంలను కవర్ చేస్తుంది. ఈ ప్రయాణం తొమ్మిది రాత్రులు మరియు పది రోజులు ఉంటుందని పేర్కొంది. ప్ర‌యాణీకుల‌కు అన్ని వ‌స‌తుల‌ను ఏర్పాట్లు చేసిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే వెల్ల‌డించింది.

Also Read : Minister Ponguleti Shocking Comments : రెవెన్యూ వ్యవస్థను ప్ర‌క్షాళ‌న చేస్తాం

Exit mobile version