Asaduddin Owaisi Fired on IND vs PAK : 26 మంది ప్రాణాల కంటే మ్యాచ్ ముఖ్య‌మా..?

భార‌త్ , పాకిస్తాన్ మ్యాచ్ పై ఓవైసీ కామెంట్స్

Hello Telugu - Asaduddin Owaisi Fired on IND vs PAK

Hello Telugu - Asaduddin Owaisi Fired on IND vs PAK

Asaduddin Owaisi : హైద‌రాబాద్ ఎంఐఎం చీఫ్‌, హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ దుబాయ్ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025 మెగా టోర్నీలో భాగంగా కీల‌క‌మైన దాయాదులైన పాకిస్తాన్, భార‌త జ‌ట్ల మ‌ధ్య లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ప‌హ‌ల్గామ్ లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు జ‌రిపిన దాడుల్లో అమాయ‌కులైన 26 మందిని పొట్ట‌న పెట్టుకున్నారు. ఈ త‌రుణంలో దాయాది దేశంతో ఎందుకు మ్యాచ్ ఆడాలంటూ ప్ర‌శ్నించారు ఓవైసీ. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రాణాల కంటే క్రికెట్ మ్యాచ్ ముఖ్య‌మా, కాసులు ముఖ్య‌మా అని నిల‌దీశారు ఎంపీ.

Asaduddin Owaisi Slams

తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ఆయ‌న కేంద్ర సర్కార్ ను, బీసీసీఐని, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ను , బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షాను, ప్ర‌ధాన‌మంత్రి మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను ఏకి పారేశారు. అసదుద్దీన్ ఒవైసీ ప్రత్యర్థి దేశంతో క్రికెట్ మ్యాచ్‌లు ఆడాలనే నిర్ణయాన్ని ప్రశ్నించారు . అస్సాం ముఖ్యమంత్రికి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి వారందరికీ నా ప్రశ్న ఏమిటంటే, పహల్గామ్‌లోని మన 26 మంది పౌరుల మతాన్ని అడిగి వారిని కాల్చి చంపిన పాకిస్తాన్‌తో క్రికెట్ మ్యాచ్ ఆడటానికి నిరాకరించే అధికారం మీకు లేదా అని మండిప‌డ్డారు తీవ్ర స్థాయిలో. ర‌క్తం, నీరు ఒకే దారిలో క‌లిసి ప్ర‌వ‌హించ‌వ‌ని చెప్పిన ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఓవైసీ.

Also Read : Ukraine Shocking Attack : ర‌ష్యా ఆయిల్ టెర్మినల్ పై ఉక్రెయిన్ దాడి

Exit mobile version