APPSC : హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్ష ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) మార్పులు తీసుకు రావాలని ప్లాన్ చేస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు నోటిఫైడ్ పోస్టుల సంఖ్య కంటే 200 రెట్లు ఎక్కువ దరఖాస్తులు అందితేనే ప్రిలిమినరీ (ప్రాథమిక) పరీక్ష నిర్వహించాలని కమిషన్ ప్రతిపాదించింది. నోటిఫికేషన్ కు సంబంధించి 100 ఖాళీలను ప్రకటిస్తే, 20,000 కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తేనే ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించబడుతుంది. దరఖాస్తులు తక్కువగా ఉంటే, APPSC నేరుగా ఒకే దశ నియామక ప్రక్రియ లేదా మెయిన్స్ పరీక్షను నిర్వహించనుంది. ఖాళీల సంఖ్యతో సంబంధం లేకుండా మొత్తం దరఖాస్తులు 25,000 దాటితే సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలను నిర్వహిస్తుంది.
APPSC Key Update
అయితే, ఈ విధానం అనవసరమైన ఖర్చు, జాప్యాలకు దారితీస్తుందని కమిషన్ భావిస్తోంది. నియామక ప్రక్రియను క్రమబద్ధీకరించడం, ఖర్చులను తగ్గించడం ఈ ప్రతిపాదిత మార్పు లక్ష్యం. పరీక్ష ప్యాట్రన్ లో మార్పులు చేసేందుకు తయారు చేసిన ప్రతిపాదనులను ఏపీ కూటమి సర్కార్ ముందు ఉంచనుంది. ఒకవేళ ఇది బాగుందని అనుకుంటే , ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఇక రాబోయే రాష్ట్రంలో జరగబోయే పరీక్షల నియామకాలను రెండు పరీక్షలకు (ప్రిలిమ్స్, మెయిన్స్ ) బదులుగా ఒకే పరీక్షతో పూర్తి చేసేందుకు వీలు కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 ప్రకారం స్థాపించబడిన రాజ్యాంగ సంస్థ. రాష్ట్రంలోని వివిధ పౌర సేవలు, ప్రభుత్వ పోస్టులకు నియామకాలను నిర్వహించడానికి ఇది బాధ్యత వహిస్తుంది.
రాష్ట్ర సేవలకు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు , విభాగ పరీక్షలను నిర్వహించడం , నియామక నియమాలు, పదోన్నతులు, బదిలీలు , క్రమశిక్షణా చర్యలు తీసుకునే వివిధం అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది.
Also Read : Tejashwi Yadav Shocking Comments : ఈసీ అక్రమాలపై ఆధారాలు ఉన్నాయి
