Tejashwi Yadav Shocking Comments : ఈసీ అక్ర‌మాల‌పై ఆధారాలు ఉన్నాయి

స్ప‌ష్టం చేసిన తేజ‌స్వి యాద‌వ్

Hello Telugu - Tejashwi Yadav Shocking Comments

Hello Telugu - Tejashwi Yadav Shocking Comments

Tejashwi Yadav : బీహార్ – ఆర్జేడీ సీనియ‌ర్ నాయ‌కుడు తేజ‌స్వి యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీహార్ ఓటర్ల జాబితాలో జరిగిన ఈసీ ‘అక్రమాలపై త‌మ వ‌ద్ద‌ ఆధారాలు ఉన్నాయన్నారు. మంగ‌ళ‌వారం తేజ‌స్వి యాద‌వ్ (Tejashwi Yadav) మీడియాతో మాట్లాడారు. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు, ప‌త్రాల‌ను కోర్టులో స‌మ‌ర్పిస్తామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా బీహార్ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపించారు. తేజస్వి యాదవ్ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)పై విరుచుకు పడ్డారు. ద్వంద్వ ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉన్నారనే ఆరోపణలకు స్పందిస్తూ, తాను సమాధానం ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ప్రక్రియలో బహుళ వ్యత్యాసాలకు సంబంధించిన ఆధారాలను కూడా ఆర్జేడీ సేకరిస్తోందని స్ప‌ష్టం చేశారు.

Tejashwi Yadav Key Comments on EC

తాము క్షేత్ర స్థాయిలో జ‌రిపిన ప‌రిశీల‌న‌లో ఆస‌క్తిక‌ర వాస్త‌వాలు వెలుగు చూశాయ‌న్నారు. ఓటరు జాబితా నుండి చాలా మంది పేర్లు తప్పిపోయాయని అన్నారు తేజ‌స్వి యాద‌వ్. బాధ్య‌త క‌లిగిన ఎన్నిక‌ల క‌మిష‌న్ కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోక పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇదిలా ఉండ‌గా త‌న చిర‌కాల మిత్రుడు ఝార్కండ్ సీఎం సోరేన్ తండ్రి శిబూ సోరేన్ నిన్న మృతి చెందారు. ఆయ‌న‌కు చివ‌రి సారిగా నివాళులు అర్పించేందుకు జార్ఖండ్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఈ సంద‌ర్బంగా ఈసీ వ్య‌వ‌హారంపై స్పందించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో ఓట‌ర్ జాబితా అత్యంత ముఖ్య‌మ‌న్నారు తేజ‌స్వి యాద‌వ్.

Also Read : TVK Party Meeting – Police Reject : టీవీకే స‌మావేశంపై పోలీసుల అభ్యంత‌రం

Exit mobile version