YS Sharmila : వైఎస్సార్ కడప జిల్లా – ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ అయ్యారు. YSR ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేపట్టడం పట్ల స్పందించారు. వారి న్యాయమైన డిమాండ్లకు తాము మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సీఓఏ అనుమతులు ఇవ్వకుండానే ఎలా విద్యార్థులను తీసుకున్నారంటూ ప్రశ్నించారు. సోమవారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పాపం ముమ్మాటికీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డిలదేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
YS Sharmila Shocking Comments on Jagan
ఒక్కో విద్యార్థు చదువుకునేందుకు రూ. 15 లక్షలు ఖర్చు చేశారని అన్నారు. ఈ సమయంలో కూటమి సర్కార్ స్పందించాలని షర్మిలా రెడ్డి (YS Sharmila) డిమాండ్ చేశారు. 5 ఏళ్లు ఈ కోర్సు చదివారని, ప్రస్తుతం పూర్తయ్యే దశలో ఉన్నారని తెలిపారు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నారంటూ పేర్కొన్నారు. కొత్త జీవితాన్ని మొదలు పెట్టే సమయంలో వాలిడేటెడ్ సర్టిఫికెట్ వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారని , వారికి భరోసా కల్పించాలని కోరారు సీఎం చంద్రబాబు నాయుడును. ఇది అత్యంత చాలా బాధాకరమని వాపోయారు. 2020లో వైఎస్ఆర్ యూనివర్శిటీని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
అప్పుడు కౌన్సిల్ ఆఫ్ ఆర్టిటెక్క్చర్ అనుమతి ఇవ్వలేదన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి. తొలి బ్యాచ్ లో చేరికలకు ప్రభుత్వం మభ్య పెట్టిందన్నారు. ఇది చాలా అన్యాయమని ఆరోపించారు. ఇప్పటి వరకు తొలి బ్యాచ్ ఎన్ రోల్ మెంట్ జరగలేదన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు ఏపీపీసీసీ.
Also Read : National Medical Commission Interesting : రాబోయే 5 ఏళ్లలో 75 వేల మెడికల్ సీట్లు
