AP Speaker Ayyannapatrudu Important Meet : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌తో ఏపీ స్పీకర్ భేటీ

కామ‌న్వెల్త్ కీల‌క సమావేశంలో పాల్గొన్న అయ్య‌న్న‌

Hello Telugu - AP Speaker Ayyannapatrudu Important Meet

Hello Telugu - AP Speaker Ayyannapatrudu Important Meet

Ayyannapatrudu : లండ‌న్ : ఏపీ స్పీక‌ర్ చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు బిజీగా ఉన్నారు. ఆయ‌న లండ‌న్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బ‌గా శాసన సభాపతి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో లండన్‌లో భేటీ అయ్యారు. 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌కు వెళ్తున్నారు. ఈసంద‌ర్బంగా భారత ప్రతినిధుల గౌరవార్థం యూకేలోని భారత హైకమిషనర్ లండన్‌లోని ఇండియా హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu), రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ పాల్గొన్నారు. అక్క‌డి నుండి 68వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొనేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈరోజు లండన్ నుండి బ్రిడ్జ్‌టౌన్‌కు బయలుదేరి వెళ్లారు.

AP Assembly Speaker Ayyannapatrudu Meet

ఇదిలా ఉండ‌గా ప్రపంచ‌లోని అన్ని దేశాల నుంచి ప్ర‌తినిధులు, స్పీక‌ర్లు, చైర్మ‌న్లు హాజ‌రు కానున్నారు. ఇక్క‌డ చ‌ట్ట స‌భ‌ల్లో ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకోవాలి, ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే దానిపై విస్తృతంగా చ‌ర్చించ‌నున్నారు. అంతే కాకుండా యావ‌త్ ప్ర‌పంచానికి స‌వాల్ గా మారిన ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌పై కూడా వీరంతా విస్తృతంగా స‌మాలోచ‌న‌లు జ‌ర‌పనున్నారు. అంతే కాకుండా ఈ భార‌తీయ డెలిగేట్స్ టీంకు లోక్ స‌భ చైర్మ‌న్ ఓం బిర్లా నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఏపీ నుంచి స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు హాజ‌ర‌వుతుండ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ గౌర‌వం త‌న‌కు ద‌క్క‌డం ప‌ట్ల సంతోషంగా ఉంద‌న్నారు.

Also Read : Hyderabad Police Commission Warning : మొబైల్ చూస్తూ డ్రైవింగ్ చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

Exit mobile version