Singapore : విశాఖపట్నం : ఏపీ ప్రభుత్వంతో సింగపూర్ సర్కార్ కీలకమైన ఒప్పందం చేసుకుంది. విశాఖపట్నం వేదికగా సర్కార్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సు శనివారం నాటితో ముగుస్తుంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున కంపెనీల ప్రతినిధులు , కన్సల్టెంట్స్, సీఈఓలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు హాజరయ్యారు. ఇదిలా ఉండగా సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ ఇండస్ట్రీ మంత్రి గాన్ సో హాంగ్ తో ఒప్పంద పత్రాలను ఇచ్చి పుచ్చుకున్నారు మంత్రి నారా లోకేష్.
AP-Singapore Agreement
అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ‘ఏపీ -సింగపూర్ మధ్య కుదిరిన ఎంఓయూ ఓ అద్భుతమైన ప్రయాణానికి నాంది పలుకుతుందని స్పష్టం చేశారు మంత్రి. విజయవాడ- సింగపూర్ మధ్య విమాన సర్వీసు నడపాలని నిర్ణయించడం జరిగిందని చెప్పారు. దీని వల్ల వ్యాపార, వాణిజ్య , సాంస్కృతిక పరంగా మరింత సంబంధాలు బలపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు నారా లోకేష్. ఏపీ సర్కార్ సదస్సు ద్వారా 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Also Read : AP Growth – Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ తయారీ యూనిట్
