AP Growth – Nara Lokesh : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వ్యాక్సిన్ త‌యారీ యూనిట్

భార‌త్ బ‌యోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లాను కోరిన లోకేష్

Hello Telugu - AP Growth - Nara Lokesh

Hello Telugu - AP Growth - Nara Lokesh

AP : విశాఖ‌ప‌ట్నం : భార‌త్ బ‌యోటెక్ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుచిత్రా ఎల్లా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంత‌ర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున పేరు పొందింది వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌. ప్ర‌ధానంగా క‌రోనా కాటు వేస్తున్న స‌మ‌యంలో టాప్ లో నిలిచింది స‌ర‌ఫ‌రాలో. దిగ్గ‌జ అమెరికా లాంటి దేశం కూడా భార‌త దేశంలో త‌యారు చేసిన వ్యాక్సిన్ల‌పై ఆధార‌ప‌డ్డాయి. ఇదిలా ఉండ‌గా ఏపీ (AP) స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా సీఐఐ భాగ‌స్వామ్య స‌ద‌స్సును నిర్వ‌హిస్తోంది. ఈ స‌దస్సులో పాల్గొన్నారు భార‌త్ బ‌యోటెక్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ సుచిత్రా ఎల్లా.

AP Growth

ఆమెతో పాటు చీఫ్ డెవలప్ మెంట్ ఆఫీసర్ రేచస్ ఎల్లా రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై చ‌ర్చించారు సుచిత్రా ఎల్లా. భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్ (కోవిడ్ – 19), రోటావాక్ (రోటా వైరస్), టైప్ బార్ టిసివి (టైఫాయిడ్ వ్యాక్సిన్), జెన్వాక్ (జపనీస్ ఎన్సెఫలిటీస్) వంటి వ్యాక్సిన్లను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలకు సరఫరా చేస్తోంది. అన్ని విధాలా అనుకూలతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో వ్యాక్సిన్ తయారీ యూనిట్ నెలకొల్పాలని కోరారు మంత్రి నారా లోకేష్. మంత్రి చేసిన విన్న‌పానికి సానుకూలంగా స్పందించారు భార‌త్ బ‌యోటెక్ ఎండీ సుచిత్రా ఎల్లా.

Also Read : Nara Lokesh Important Meeting : ఏపీలో మెరైన్ ప‌రిక‌రాల త‌యారీ ఏర్పాటు

Exit mobile version