CM Chandrababu : అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu ) కీలక ప్రకటన చేశారు. తనతో భేటీ అయ్యారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, అధికారులు సురేష్, ఆకే రవికృష్ణ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణసంచా పేలుడు ఘటనపై నివేదికను సీఎంకు అందించారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఆదేశించారు. ఒకే షెడ్డులో ఒకే చోట 14 మంది కార్మికులు మెటిరీయల్ మాన్యుఫాక్చరింగ్ చేశారని నివేదికలో వెల్లడించారు. హార్డ్ మెటీరియల్ వాడటం వల్లే స్పార్క్ వచ్చి, మాన్యుఫాక్చరింగ్ జరుగుతున్న ప్రాంతంపై పడిందని పేర్కొన్న అధికారులు. ఏమాత్రం నిబంధనలు పాటించలేదని నివేదికలో వెల్లడించారు.
CM Chandrababu Key Announcement
ఒక్కో బాధిత కుటుంబానికి రూ.15 లక్షల చొప్పున పరిహారం అందించాలని అందించాలన్నారు చంద్రబాబు నాయుడు. లైసెన్సు ఇచ్చే ముందు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది అధికారులు తనిఖీలు నిరంతరం చేయాలని సూచించారు. తయారీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. ఎక్స్ ప్లోజివ్ మెటీరియల్ పై నియంత్రణ కోసం ఇక నుంచి ఆన్ లైన్ ద్వారానే కొనుగోళ్లు జరిగేలా చూడాలన్నారు బాణసంచా కోసం ఉపయోగించే పదార్ధాల కొనుగోళ్లు, తయారీపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం లేని తయారీ కేంద్రాలను, ఆథరైజేషన్ లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
Also Read : DY CM Pawan Kalyan Clear Instructions : పేకాట శిబిరాల నిర్వహణపై నివేదిక ఇవ్వండి
