నీటి పారుద‌ల రంగాన్ని నిర్వీర్యం చేసిన జ‌గ‌న్ రెడ్డి

ఆరోపించిన మంత్రి నిమ్మ‌ల రామానాయుడు

hellotelugu-NimmalaRamanaidu

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో నీటి పారుద‌ల రంగాన్ని త‌న పాల‌నా కాలంలో జ‌గ‌న్ రెడ్డి నాశ‌నం చేశాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామా నాయుడు. శుక్ర‌వారం ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్య పేట నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ప‌ర్య‌టించారు. రూ. 15.33 కోట్లతో వేదాద్రి కంచల ఎత్తిపోతల పధకం పునరుద్ధరణ పనులను ప్రారంభించారు నిమ్మల రామానాయుడు. కార్యక్రమం లో ఎంపి కేశినేని చిన్ని, ఎమ్మెల్యేలు శ్రీరామ్ తాతయ్య, తంగిరాల సౌమ్య, ఇరిగేషన్ సలహాదారులు వెంకటేశ్వరరావు, ఐడీసీ ఎండీ తిరుమలరావు పాల్గొన్నారు.. ఈ పున‌రుద్ద‌ర‌ణ ప‌నుల ద్వారా జగ్గయ్య పేట, నందిగామ నియోజకవర్గాల్లోని 17,366 ఎకరాల ఆయకట్టుకు నీరందించనుంద‌ని ఈ సంద‌ర్బంగా వెల్ల‌డించారు మంత్రి .

2014-19 టిడిపి ప్రభుత్వంలో, వేదాద్రి కంచల లిఫ్ట్ స్కీం నిర్వహణ కోసం, 5.36 కోట్లు ఖర్చు చేసి సాగు నీరు అందించామ‌ని చెప్పారు. వైసిపి ప్రభుత్వంలో నిర్వహణకు ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయక పోవడంతో 2021 నుండి వేదాద్రి కంచల లిఫ్ట్ స్కీం మరుగున పడి పోయింద‌న్నారు. 2027 ఖరీఫ్ సీజన్ నాటికి వేదాద్రి కంచల ఎత్తిపోతల పధకం పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అన్నారు నిమ్మ‌ల రామా నాయుడు. 5 ఏళ్ళ వైసిపి పాలనలో ఇరిగేషన్ రంగం విధ్వంశమైందనడానికి ఐడిసినే ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు.

రాష్ట్రం లో 1023 లిఫ్ట్ స్కీం లు ఉంటే, కేవలం 166 మాత్రమే పని చేస్తున్నాయని అన్నారు. గత ఐదేళ్లలో రిపేర్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయక పోవడంతో లిఫ్ట్ స్కీం లు మరుగున పడ్డాయని ఆరోపించారు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంల కింద 8.2 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, గొడ్డలి పార్టీ విధ్వంసం తో 4 లక్షల ఎకరాలు మూత పడిందన్నారు. గొడ్డలి పార్టీ విధ్వంస పాలన కారణంగా 4 లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టుకు సాగునీరందని పరిస్ధితి నెల‌కొంద‌న్నారు. చంద్రబాబు ఆదేశాల ప్రకారం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ల రిపేర్లు, 10 ఏళ్ళు మెయింటెన్స్ పనులు చేసేలా 4500 కోట్ల తో టెండర్లు పిలుస్తున్నాం అన్నారు . వైసీపీ పాలనలో నిర్వహణ పనుల కోసం 5ఏళ్లలో 200 కోట్లు కేటాయిస్తే, కూటమి ప్రభుత్వం లో 2 ఏళ్ళలోనే 1200 కోట్లు ఖర్చు చేశామ‌ని పేర్కొన్నారు.

Exit mobile version