AP : విశాఖపట్నం : తూర్పు నావికా దళంలోని ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా గురువారం విశాఖపట్నంలో సీఎం నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా దేశానికి సంబంధించి కీలకమైన అంశాలపై వీరు చర్చించారు. ప్రధానంగా భారత దేశ రక్షణ రంగంతో పాటు సముద్ర పర్యావరణ వ్యవస్థలో ఏపీ (AP) రాష్ట్రం కీలకమైన పాత్ర పోషించనుందని తెలిపారు. దీనికి కారణంగా ఏ రాష్ట్రానికి లేనంతగా సముద్ర తీర ప్రాంతం ఏపీలో ఉందని పేర్కొన్నారు సంజయ్ భల్లా. కాగా ఆంధ్రప్రదేశ్ పాత్రను బలోపేతం చేయడంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై సూచనలు ఇవ్వాల్సిందిగా సంజయ్ భల్లాను కోరారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
AP Growth in Marine Ecosystem
ప్రస్తుతం విశాఖ వేదికగా ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహిస్తోంది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారు. ఈ సమ్మిట్ రెండు రోజుల పాటు జరగనుంది. రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఏపీ సర్కార్. చర్చల్లో పురోగతి కనిపించింది. ఏరోస్పేస్ , డిఫెన్స్ పాలసీ 2025–2030 కింద, విశాఖపట్నం-శ్రీకాకుళం కారిడార్ వెంబడి నావికా వ్యవస్థలు , షిప్ బిల్డింగ్ క్లస్టర్‌ను స్థాపించడానికి తాము కృషి చేస్తున్నామని వెల్లడించారు సీఎం. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా స్వదేశీ నావికా సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. తీరప్రాంత పర్యాటకం, యువత అభివృద్ధి , నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించడంలో సహకారం కోసం అవకాశాలను కూడా తాము గుర్తించామన్నారు.
Also Read : Italian Ambassador Important Meeting : ఏపీ సీఎంతో ఇటలీ రాయబారి భేటీ
