AP Govt Important Updates : చేనేత కార్మికుల‌కు ఏపీ స‌ర్కార్ ఖుష్ క‌బ‌ర్

రూ. 2 కోట్ల‌కు పైగా బ‌కాయిలు విడుద‌ల

Hello Telugu - AP Govt Important Updates

Hello Telugu - AP Govt Important Updates

AP Govt : అమ‌రావ‌తి : రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, నేతన్నల సంక్షేమానికి కార్యక్రమాలు చేపడుతూనే, ఆప్కో ద్వారా బకాయిలు కూడా చెల్లించాలని కూటమి ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 84 చేనేత సొసైటీల నుంచి ఆప్కో వస్త్రాలను కొనుగోలు చేస్తుంటుంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసే వస్త్రాలను ఆప్కో షోరూమ్ లు, ఈ కామర్స్ ద్వారా విక్రయాలు చేస్తోంది. నేతన్నల నుంచి కొనుగోలు చేసిన వస్త్రాలకు సంబంధించి బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఆదేశాలు జారీచేశారు. తక్షణమే ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిలను చెల్లించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. మంత్రి ఆదేశాలకనుగుణంగా మొదటి విడతగా ఆప్కో అధికారులు రూ.2,00,32,615.41లను శుక్రవారం విడుదల చేశారు. ఈ నిధులు ఆయా చేనేత సొసైటీల ఖాతాల్లో జమకానున్నాయి.

AP Govt Key Updates for Handloom Workers

రాష్ట్రంలో ఏడు డివిజన్లలో 84 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలకు మొదటి విడతగా రూ.2,00,32,615.41ల బకాయిలు చెల్లించారు. శ్రీకాకుళం డివిజన్లలో ఉన్న నాలుగు సొసైటీలకు రూ.7,57,142లు, విజయనగరం డివిజన్లలో ఉన్న ఏడు సొసైటీలకు రూ.3,44,007ల బకాయిలు విడుదల చేశారు. రాజమండ్రి డివిజన్లో 27 సొసైటీలకు రూ.61,07,690లు, విజయవాడ డివిజన్లో ఉన్న 21 సొసైటీలకు రూ.48,29,780లు చెల్లించారు. తిరుపతి డివిజన్లో ఉన్న 17 సొసైటీలకు రూ.36,64,628లు, కడప డివిజన్లో ఉన్న 5 డివిజన్లకు రూ.40,30,894లు బకాయిలు విడుదల చేశారు. కర్నూలు డివిజన్ లో ఉన్న ఏడు సొసైటీలకు రూ.2,98,472ల మొదటి విడత బకాయిలు చెల్లించారు. త్వ‌ర‌లోనే మిగిలిన బ‌కాయిల‌ను కూడా విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు మంత్రి ఎస్. స‌విత‌.

Also Read : CM Chandrababu Challenge : దేశంలోనే ఏపీని రోల్ మోడ‌ల్ గా చేస్తాం : సీఎం

Exit mobile version