AP Govt : అమరావతి : కేంద్ర ప్రభుత్వం తీసుకువ చ్చిన జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రయోజనాలు ప్రతి ఒక్కరికి అందేలా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూటమి ప్రభుత్వం (AP Govt) విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ మేరకు అసెంబ్లీలోని తన చాంబర్ లో మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జీఎస్టీ సంస్కరణలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది. జీఎస్టీ 2.0 సంస్కరణలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, అధికారులు విస్తృతంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సీఎం చంద్రబాబు నాయుడుకి నివేదించనున్నారు.
AP Govt Key Updates on GST
దసరా నుంచి దీపావళి వరకు నెల రోజుల పాటు జీఎస్టీ సంస్కరణలపై విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఆదేశించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలకు, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని, ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర మంత్రులు వంగలపూడి అనిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇదే సమయంలో పలు సూచనలు చేశారు మంత్రులు.
Also Read : Speaker Ayyannapatrudu Shocking Comments : ఏపీ స్పీకర్ అయ్యన్న కీలక ప్రకటన
