AP Govt : రాష్ట్రంలో త్వరలోనే ‘ఆడబిడ్డ నిధి’ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.
AP Govt key Update on Aadabidda Nidhi
ఆడబిడ్డలకు పెళ్లి, ఉద్యోగం వచ్చే వరకు కొత్త కూటమి ప్రభుత్వం ‘ఆడబిడ్డ నిధి’ ద్వారా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. చెప్పినదాన్ని చేసి చూపించే నేత చంద్రబాబునాయుడు మాత్రమేనని పేర్కొన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ ప్రజలు విశ్వసించి టీడీపీకి గెలుపు అందించారని మంత్రి చెప్పారు.
దుర్వేసి గ్రామ ప్రజల కోరిక మేరకు అక్కడ సుంకులమ్మ ఆలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
ఆలయాల్లో పూజారుల కోసం ప్రతి నెల రూ.10 వేలు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో 47 ఆలయాల అభివృద్ధికి రూ.43 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కాల్వబుగ్గ ఆలయానికి ప్రత్యేకంగా రూ.4 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు.
మాజీ ప్రభుత్వాన్ని విమర్శించిన మంత్రి ఆనం… వైసీపీ హయాంలో రైతుల పత్రాలపై జగన్ ఫోటోలు ముద్రించారని, రైతుల భూములను ప్రభుత్వ భూములుగా చూపించి రుణాలు పొందాలన్న కుట్ర జరిగినట్లు ఆరోపించారు.
ఇలా నూతన ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తోందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు.
Also Read : Indian Railways Growth : రైల్వే సర్కార్ శుభవార్త..ఇకపై తత్కాల్ టికెట్ కు నో ఆధార్
