AP Govt : అమరావతి – ఏపీ సర్కార్ (AP Govt) తీపి కబురు చెప్పింది వర్కింగ్ జర్నలిస్టులకు. సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ఆదేశాల మేరకు వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంగళవారం జీవో యం.యస్ నెం. 77 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకులు హిమాన్షు శుక్ల తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడిటేషన్లు అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం క్రింద రూ. 1250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి లబ్ధి పొందవలసినదిగా సంచాలకులు కోరారు.
AP Govt Interesting Update
Head of Account: 8342-00-120-01-03-001-001, DDO Code: 2703 0802 003 ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, రెన్యూవల్ చేయించుకున్న రాష్ట్ర స్థాయి అక్రిడిటేషన్ జిరాక్స్ కాపీలను విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్, ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లోని రెండవ ఫ్లోర్ లో ఉన్న సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకుల కార్యాలయంలోనూ, జిల్లా స్థాయి జర్నలిస్టులు సంబంధిత జిల్లా కేంద్రాల్లోని సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాల్సిందిగా సూచచించారు హిమాంశు శుక్లా.
వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం ప్రీమియం రూ. 2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ. 1,250, ప్రభుత్వం వాటా రూ. 1,250 అని పేర్కొన్నారు. జర్నలిస్టు, భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. ఈ స్కీమ్ లో భాగంగా ప్రభుత్వం కార్పస్ ఫండ్ ను నిర్వహిస్తూ జర్నలిస్టుల వైద్య ఖర్చులను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు విధి విధానాలను అనుసరించి చెల్లిస్తుందన్నారు.
జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం సంభవించిన ప్రతిసారి రూ. 2 లక్షల వరకు విలువ చేసే వైద్య సేవలు అందుతాయని, ఇలా సంవత్సర కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని స్పష్టం చేశారు. వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ ద్వారా జర్నలిస్టులకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ (EHS) తరహాలో నగదు రహితంగా వైద్య సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు.
Also Read : Tesla New Innovation : ఇండియాలో మొట్టమొదటి షోరూమ్ ఓపెన్ చేసిన ‘టెస్లా’
